టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరుగాంచిన పూరి జగన్నాథ్ ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండతో ఒక సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రారంభం అయిన ఈ సినిమా కు టైటిల్, ఫైటర్ అని పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నప్పటికీ సినిమా యూనిట్ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. విజయ్సినిమా కోసం పలు రకాల విదేశీ యుద్ధ విద్యలు నేర్చుకున్నాడని, ఇప్పటివరకు కెరీర్ పరంగా తాను పోషించని ఒక ఎనర్జిటిక్ రోల్ లో ఆయన నటిస్తున్నాడని అంటున్నారు. పాన్ ఇండియా ఫీల్ తో తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళ, భాషల్లో కూడా భారీ రేంజ్ లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు ఖర్చు కూడా భారీ లెవెల్లో పెడుతున్నారని టాక్. 

 

ముందుగా బ్యాంకాక్ లో ఎంతో గ్రాండ్ లెవెల్లో ప్రారంభం అయిన ఈ సినిమా షూటింగ్ కొద్దిరోజుల క్రితం ముంబైలో జరిగినట్లు తెలుస్తోంది. విజయ్ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా పూరి కనెక్ట్స్ బ్యానర్ పై సహ నిర్మాత ఛార్మితో కలిసి పూరీనే స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక గత కొద్దిరోజులుగా ఈ సినిమాకు సంబందించిన పలు ఫోటోలను పూరి తో పాటు సహ నిర్మాత ఛార్మి కూడా తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేస్తూ వస్తున్నారు. 

 

అయితే ఎప్పటికప్పుడు సినిమాకు సంబంధించి రిలీజ్ అవుతున్న ఆ ఫోటోలను బట్టి చూస్తుంటే సినిమా ఎంతో గ్రాండ్ లెవెల్లో తెరకెక్కుతున్నట్లు మనకు తెలుస్తోంది. అయితే ఆ హడావుడి చూసిన కొందరు నెటిజన్లు, సినిమాపై మీరిస్తున్న బిల్డప్ మాత్రం బాగానే ఉంది, మరి ఇంతకీ సినిమాలో కథ, కథనాల వంటి అసలు మ్యాటర్ ఉందా లేదా అంటూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కొంత వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా దసరా పండుగ కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే ఛాన్స్ కనపడుతోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: