ప్రస్తుతం టాలీవుడ్ నటుడు విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా నారప్ప. వి క్రియేషన్స్ తో పాటు సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు యువ దర్శకడు శ్రీకాంత అడ్డాల దర్శకత్వం వహిస్తుండగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇటీవల తమిళ్ లో రిలీజ్ అయి సూపర్ హిట్ కొట్టిన అసురన్ సినిమాకు అధికారిక రీమేక్ గా తెరకెక్కుతున్న సినిమాలో వెంకటేష్ టైటిల్ రోల్ పోషిస్తుండగా ఆయన సరసన హీరోయిన్ గా జాతీయ ఉత్తమ నటి అవార్డు గ్రహీత ప్రియమణి హీరోయిన్ గా నటిస్తోంది. వాస్తవానికి తమిళ్ లో వెట్రి మారన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో హీరో ధనుష్ అద్భుత నటనతో పాటు దర్శకుడి వెట్రి అత్యద్భుతన దర్శకత్వ ప్రతిభ ఈ సినిమాని సూపర్ డూపర్ హిట్ కొట్టేలా చేసాయి. 

 

అయితే ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న ఈ సినమాలో వెంకటేష్ ఎప్పటివలె నారప్ప క్యారెక్టర్ లో అదరగొట్టేలా యాక్ట్ చేస్తున్నారని, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అనంతపురం పరిసర ప్రాంతాల్లో జరుగుతుందని సమాచారం. అయితే ఈ సినిమా విషయమై దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ను ఉద్దేశించి కొందరు నెటిజన్లు ఈ విధంగా కామెంట్స్ చేస్తున్నారు. గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన బ్రహ్మోత్సవం సినిమా తీసి ఆయనకు అతి పెద్ద డిజాస్టర్ ని అందించిన శ్రీకాంత్, ఈ సినిమాను కూడా ఆ విధంగా చేయడు కదా, మొత్తంగా మా నారప్పను ముంచుతావో తెలుస్తావో ఏమో అనుమానంగా ఉందప్ప అంటూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఆయన పై కామెంట్స్ చేస్తున్నారు. 

 

అయితే బ్రహ్మోత్సవం మాదిరిగా ఈ సినిమా ఫ్లాప్ అయ్యే అవకాశం తక్కువ అని, ఎందుకంటే దీని ఒరిజినల్ వెర్షన్ అయిన అసురన్ కథలో ఎంతో బలం ఉందని, తప్పకుండా దర్శకుడు శ్రీకాంత్నారప్ప తో సూపర్ హిట్ కొట్టి అటు వెంకీ కి సూపర్ హిట్ అందించడంతో పాటు, తన కెరీర్ కు కూడా మంచి బ్రేక్ వచ్చేలా చేసుకుంటాడని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అయి దర్శకుడు శ్రీకాంత్ కు ఏ రేంజ్ లో మళ్ళి లైఫ్ ఇస్తుందో చూడాలి....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: