టాలీవుడ్ లో ఐటెం గర్ల్ అనే పేరుకి అసలు ఇప్పుడు అర్ధం మారిపోయిందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. టాలీవుడ్ లో ఐటెం గర్ల్స్ హవా ఎక్కువ కాలమే కొనసాగింది. వారికి అంటూ కొంత డిమాండ్ ఉండేది. వారి డాన్స్ కి ప్రత్యేకంగా అభిమానులు కూడా ఉండే వారు అప్పట్లో. దీనితో దర్శక నిర్మాతలు కూడా వారితో సినిమాలు చేసే వాళ్ళు. వారి కోసం ప్రత్యేకంగా కొన్ని పాటలు అంటూ ఉండేవి. అయితే ఈ తరంలో మాత్రం ఫెడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్ ని ఐటెం గర్ల్ గా వాడేస్తున్నారు సిని జనాలు. 

 

దర్శక నిర్మాతలు వారికి భారీ పారితోషికం ఇచ్చి మరీ ఐటెం సాంగ్స్ చేయిస్తున్నారు ఈ మధ్య కాలంలో. ఇది మరీ ఎక్కువైపోయింది. కాజోల్, పూజ హెగ్డే ఇలా చాలా మంది హీరోయిన్లు ఆ అవతారం ఎత్తారు. వాళ్లకు డాన్స్ ఉండటం క్రేజ్ ఉండటం తో దర్శక నిర్మాతలు ఇప్పుడు వారి మీదే ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ  వస్తున్నారు. ఇచ్చిన అవకాశాలను వాళ్ళు కూడా వాడుకుంటున్నారు. స్టార్ హీరోయిన్ ఐటెం సాంగ్ చేస్తుంది అంటే చాలు సినిమాకు మంచి క్రేజ్ వస్తుంది ఈ రోజుల్లో. ఆ సినిమా కమర్షియల్ గా కూడా విజయం సాధిస్తుంది. 

 

అందుకే జనతా గ్యారేజ్, రంగస్థలం లాంటి సినిమాల్లో ఐటెం గర్ల్స్ ఆ విధంగా విజయవంతం అయ్యారు. ఆ సినిమాలలో పాటలు చేసిన ఇద్దరు హీరోయిన్ లు స్టార్ హీరోయిన్ లే కావడం విశేషం. వారు ఎంత అడిగితే అంత ఇస్తున్నారు కూడా దర్శకులు. ఈ మధ్య ఇది ఒక ట్రెండ్ కూడా అయిందని అంటున్నారు. ఇక అవకాశాలు రాని హీరోయిన్స్ తమకు ఉన్న పరిచయాల ద్వారా ఇప్పుడు ఐటెం సాంగ్స్ ఎక్కువగా చేస్తూ ప్రేక్షకులను అప్పుడప్పుడు అలరించడం మొదలుపెట్టారు. ఇదే మార్కెట్ కూడా ఇప్పుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: