దక్షిణాది సిని పరిశ్రమలోనే కాదు భారతీయ సినిమాను కూడా తన వైపుకి తిప్పుకున్న నటి సిల్క్ స్మిత. సిల్క్ కళ్ళను చూసి ఇంటికి వెళ్లి ఎందరో కుర్రాళ్ళు అప్పట్లో ఇబ్బందులు పడే వాళ్ళు. సినిమాలో ఆమె పాట ఉన్నా ఆమె కనపడినా సరే సినిమా సూపర్ హిట్ అనే పేరు ఉండేది. సినిమాల్లోకి అడుగుపెట్టిన కొన్ని రోజులకే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సిల్క్. గోదావరి జిల్లాలో మారుమూల ప్రాంతంలో పుట్టిన ఆమె ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమను ఏలింది. ఎందరో అగ్ర హీరోల సినిమాల్లో ఆమె కనిపించింది. 

 

ఆమె తెర మీద కనపడితే చాలు అన్ని వర్గాల ప్రేక్షకులు అలా చూసే వారు. బాలీవుడ్ లో కూడా ఆమెకు ఆఫర్స్ వచ్చాయి. అయినా సరే ఆమె బాలీవుడ్ మీద కంటే టాలీవుడ్ మీదే ఎక్కువగా దృష్టి పెట్టింది. కాని ఆమె జీవితంలో కొన్ని మలుపులు అర్ధంతరంగా ఆమె కెరీర్ ని ముగించాయి. విజయలక్ష్మి గా జీవితాన్ని ప్రారంభించి సిల్క్ స్మిత గా వెండి తెర మీద తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటి. ఆమె రేంజ్ వేరని అంటున్నారు ఆమె గురించి తెలిసిన వాళ్ళు. తాను చేసే డాన్స్ అయినా పాత్ర అయినా సరే సినిమాలో హైలెట్ అయితేనే ఆమె చేసేవారు. 

 

దర్శక నిర్మాతలకు కూడా ఆమె ఇదే విషయాన్ని చెప్పే వారు. ఇప్పుడు చాలా మంది అవకాశం వస్తే చాలనుకుని నటిస్తూ ఉంటారు. కాని ఆమె అలా కాదు. పాత్రకు ప్రాధాన్యత ఉంటే అవకాశాలు అవే వస్తాయని నమ్మిన నటి. ఆ పట్టుధలతోనే ఆమె నటించారు... మెప్పించారు. టాలీవుడ్ లో సిల్క్ తర్వాత ఎందరో వచ్చారు. అయినా సరే సిల్క్ ని మాత్రం తెలుగు ప్రేక్షకులు ఎప్పటికి మరువలేరు. తమిళంలో కూడా ఆమెకు భారీగా అభిమానులు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: