టాలీవుడ్ లో ఐటం సాంగ్స్ హవా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కరెక్ట్ టైం లో కరెక్ట్ సాంగ్ పడితే ఆడియెన్స్ రియాక్షన్ వేరేలా ఉంటుంది. స్టార్ సినిమాల్లో ఐటం సాంగ్స్ కంపల్సరీ.. సినిమా సీరియస్ గా నడుస్తున్న టైం లో ఒక మంచి మాస్ సాంగ్ వారికి మంచి అనుభూతి కలిగిస్తుంది. ఐటం సాంగ్స్ కు టాలీవుడ్ చాలా స్పెషల్. ఇక వీటిలో ఐటం సాంగ్ అనగానే గుర్తొచ్చే కొన్ని సాంగ్స్ ఉన్నాయి. వాటిలో సూపర్ స్టార్ మహేష్ పోకిరి సినిమాలోని ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే.. ఈ సాంగ్ లో ముమైత్ ఖాన్ ఒక ఊపు ఊపేసింది.

 

మణిశర్మ సంగీతం అందించిన ఈ సాంగ్ లో ముమైత్ ఖాన్ హాట్ పర్ఫార్మెన్స్ అదరహో అనిపిస్తుంది. సినిమాలోని సాంగ్స్ అన్ని సూపర్ హిట్ కాగా కొన్నాళ్ళ వరకు ఈ ఐటం సాంగ్ వినిపించింది. ఆటోలో, బస్సుల్లో, డిస్కోలో, డిజేల్లో ఇలా అన్ని చోట్లా ఇప్పటికింకా నా వయసు సాంగ్ ఐటం సాంగ్స్ లో చాలా క్రేజ్ తెచ్చుకున్న పాట అని చెప్పొచ్చు. ఈ సాంగ్ తర్వాత ముమైత్ ఖాన్ కూడా చాలా ఆఫర్లు అందుకుంది. టాలీవుడ్ ఐటం సాంగ్స్ గురిచి ప్రస్తావించిన ప్రతిసారి పోకిరి సాంగ్ గుర్తుకొస్తుంది.'

ఈ పాట తర్వాత ముమైత్ ఖాన్ తెలుగులో బిజీ అయ్యింది. ఈ ఒక్క సాంగ్ ఆమె ఫేట్ మార్చేసిందని చెప్పొచ్చు. పోకిరి తరహాలో ఆమె చాలా సినిమాల్లో ఇలాంటి స్పెషల్ సాంగ్స్ చేస్తూ వచ్చింది. ఇంకా చెప్పాలంటే కొన్నాళ్ళు ఈ ఐటం సాంగ్స్ తో ముమైత్ ఖాన్ వేరే వాళ్లకు ఛాన్స్ ఇవ్వలేదని చెప్పొచ్చు. అయితే ఆ తర్వాత హీరోయిన్స్ కూడా ఐటం సాంగ్స్ చేయడం మొదలుపెట్టడంతో ముమైత్ ఖాన్ కు ఆఫర్లు తగ్గాయి. ఏది ఏమైనా పోకిరి లోని ఈ సాంగ్ ఐటం సాంగ్స్ లో అప్పట్లో నంబర్ 1 అని చెప్పొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: