కొణిదెల శివశంకర వరప్రసాద్... 1978 వరకు ఈ పేరు గురించి ఎవరికీ పెద్దగా తెలియదు.  1978 తర్వాత ఈ పేరు చిరంజీవిగా మారి పునాది రాళ్లు చిత్రంతో ఓ చిన్న పాత్రలో కనిపించాడు. కాకపోతే ఆ చిత్రం కంటే ముందు ప్రాణం ఖరీదు రిలీజ్ అయ్యింది.  ఈ రెండు చిత్రాల్లో చిరంజీవి పాత్రకు పెద్ద స్కోప్ లేకున్నా.. ఆయన నటనకు మంచి ప్రాధాన్యత వచ్చింది.  చిరు  నిర్మాత జయకృష్ణ ద్వారా చిరంజీవికి ముట్టిన పారితోషికం 1,116 రూపాయలు. మనవూరి పాండవులు, మోసగాడు, రాణీ కాసుల రంగమ్మ, ఇది కథ కాదు వంటి సినిమాలలో చిన్న పాత్రలు, విలన్ పాత్రల్లో నటించారు.  అప్పటి వరకు చిరంజీవి అంటే మామూలుగా చూసే ప్రేక్షకులు ఎ.కోదండరామి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ చిత్రంతో సుప్రీమ్ హీరోగా మారిపోయారు.  అప్పటి నుంచి చిరంజీవి మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 

 

తెలుగు ఇండస్ట్రీలో అప్పటి వరకు సాగుతున్న డ్యాన్స్, ఫైట్స్ విషయంలో చిరంజీవి పూర్తి మార్పులు తీసుకు వచ్చారు.  మార్షల్ ఆర్ట్స్ లో బ్రూస్ లీ, డ్యాన్స్ లో మైకేల్ జాక్సన్ లా ఎన్నో ప్రయోగాలు..తెలుగు ఇండస్ట్రీలో చేశారు.  అప్పట్లో చిరంజీవిని మైకేల్ జాక్సన్ లా చూసేవారు.  పసివాడి ప్రాణం చిత్రంలో బ్రేక్ డ్యాన్స్ ని పరిచయం చేశారు. చిరంజీవి అంటే బ్రేక్, షేక్ డ్యాన్స్ అని యూత్ తెగ పొగిడేవారు.  చంటబ్బాయ్,ఛాలెంజ్, శుభలేఖ చిత్రాలలో వివిధ తరహా పాత్రలలో మెప్పించి మంచి గుర్తింపు పొందగా, గ్యాంగ్ లీడర్ చిత్రంతో  చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగిపోయారు.  1980, 90లలో రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు వంటి వినోదాత్మక చిత్రాలు, స్వయంకృషి, రుద్రవీణ, ఆపద్భాందవుడు వంటి సున్నితమైన పాత్రల్లో నటించి మెప్పించాడు.  

 

1990 దశకం చివరిలో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి, హిట్లర్, చూడాలని వుంది చిత్రాలతో మరిన్ని విజయాలు అందుకున్నారు. 2002లో వచ్చిన ఇంద్ర, ఠాగూర్  పవర్ ఫుల్ పాత్రల్లో నటించి మెప్పించారు.  ఇలా మెగస్టార్ చిరంజీవి ఎదురు లేని స్టార్ హోదా లో ఉన్న సమయంలో శంకర్ దాదా జిందాబాద్ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిపోయారు.  పదేళ్ల తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’ తో రీ ఎంట్రీ ఇచ్చారు.  తర్వాత సైరా నరసింహారెడ్డిలో నటించారు.  ప్రస్తుతం కొరాల శవ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు.  చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు  అరడజను మంది హీరోలు తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.  చిరంజీవి అంటే అప్పటికీ.. ఇప్పటికీ యూత్ కి మాత్రమే కాదు యంగ్ హీరోలకు మంచి ఆదర్శం అంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: