అలనాటి తార సిల్క్ స్మిత..సిల్క్ స్మిత పేరు వింటే అప్పటికి ఇప్పటికి బాడీలో వైబ్రేషన్స్ వస్తాయి..  అతలా సినిమా ఇండస్ట్రీ ని ఒకానొక కాలంలో ఏలింది.. సిల్క్ స్మిత ఉంటేనే సినిమా చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు.. సిల్క్ స్మిత గూర్చి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా. ఈవిడ  దక్షిణ భారత సినీ నటి. ఈమె తెలుగు, తమిళం, కన్నడం, మళయాళం మరియు హిందీ భాషలలో 200పైగా సినిమాలలో నటించింది.  సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి.

 

 

1979లో విడుదలైన బండి చక్రం  చిత్రంలో ఆమె పాత్ర పేరు సిల్క్. ఈ పాత్రకు విశేష ఆదరణ లభించడంతో.. ఆమె తన పేరును సిల్క్ స్మితగా మార్చుకుంది.అప్పటినుండి సిల్క్ స్మిత గా అవతారం ఎత్తి చిత్ర రంగాన్ని ఒక ఊపు ఊపేసింది.. నిషా ఎక్కించే కళ్ళతో ఒక చూపు చుస్తే చాలు ఏటువంటి మగాడు అయిన ఫిదా అవ్వవలిసిందే. సిల్క్ స్మితని అందరు శృంగార నటి అని పిలుస్తారు.. అప్పట్లో అనేక సినిమాలలో ఆమె ప్రత్యేక గీతాలు, శృంగార నృత్యాలు కూడా చేసింది..ఈ శృంగార నృత్యాల వల్లనే ప్రజాదరణ తెచ్చుకుంది.. ఉదాహరణకు తెలుగులో "బావలు సయ్యా, మరదలు సయ్యా" పాట. ఎంత క్రెజ్ తెచ్చిపెటిందో మాములుగా చెప్పక్కర్లేదు..  ఎక్కువ చిత్రాలలో ఆమె ఇతరులను వలలో వేసుకొనే అమ్మాయిగా, నర్తకిగా, ప్రేక్షకులను ఉర్రూతలూగించే నృత్యాలతోను, కామోద్దీపనము కలిగించే దుస్తులతోను, ముదురు అమ్మాయిలాగా కనిపించింది. ఎక్కువుగా శృంగార నాట్యాలలో నటించేది.. 

 

 

అప్పటి కాలంలో సిల్క్ స్మిత వేషధారణ కొంచం ఇబ్బెట్టుగానే ఉండేది.. కానీ ఇప్పటి అదునాతన కాలంలో కామన్ అయిపొయింది... ఒక్క ఐటమ్ సాంగ్స్ లోనే కాకుండా సిల్క్ స్మిత కొన్ని పాత్రలలో కూడా నటించింది.. సీతాకోక చిలుకl (1981) వంటి కొన్ని చిత్రాలలో నటనాప్రధానమైన పాత్రలలోను మెప్పించింది. కానీ సిల్క్ స్మిత కి మద్యపానం తాగే అలవాటు ఉండటం వల్ల, ఆ అలవాటుని మనుకోలేక   ఆమెను నిసృహలోకి నెట్టివేసిఉండవచ్చునని అందువల్లనే ఆమె ఆత్మహత్య చేసుకొన్నదని భావిస్తున్నారు.. నాటితరం నుంచి నేటితరం వరకు ఈ పేరు తెలియని వారుండరు అనడంలో అతిశయోక్తి లేదు. తెలుగు ప్రేక్షకులకు మైకం తెప్పిస్తూ తన అంచందాలతో కైపెక్కించిన సిల్క్ స్మిత జీవితం అర్దాంతరంగా ముగిసింది.తర్వాత సిల్క్ స్మిత జీవితం ఆధారంగా కొన్ని బయో పిక్స్ కూడా వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: