పూజా హెగ్డే.. మెగా హీరో వరుణ్ తేజ్ ముకుంద సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో ఆక‌ట్టుకుని.. ఎన్టీఆర్  ‘అరవింద సమేత’ సినిమాతో హిట్ కొట్టింది. మహేష్ హీరోగా వచ్చిన మహర్షి, ఇటీవ‌ల త్రివిక్ర‌మ్‌, అల్లు అర్జున్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన అల వైకుంఠ‌పుర‌ములో చిత్రాల‌తో సూప‌ర్ హిట్ కొట్టిన ఈ భామ మంచి జోరు మీద కొన‌సాగుతోంది. ఇలా అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. 

 

ఇలా ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మ‌రోవైపు త‌న అంద‌చందాల‌తో హాట్ హాట్ ఫోటో షూట్లతో హల్ చల్ చేస్తూ కుర్రాళ్ల గుండెళ్లో తిష్ఠ వేసుకుపోయింది. పూజా అందాలను చూసి వేడితో రగిలిపోతున్నారు కుర్రాళ్ళు. ప్ర‌స్తుతంప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్‌లలో వరుస అవకాశాలతో ఫుల్‌ బిజీగా ఉన్న అందాల భామ పూజా హెగ్డే. గ్లామర్‌ షోకు ఏ మాత్రం వెనుకాడని ఈ భామ ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో మోస్ట్‌ వాంటెడ్‌గా మారిపోయింది. అయితే  టాలీవుడ్‌లో వరుసగా చిత్రాలు చేస్తున్న ఈ అమ్మడు బాలీవుడ్‌లో కూడా సినిమాలు చేస్తున్న ఈ సమయంలో కోలీవుడ్‌ నుండి కూడా ఛాన్స్‌ దక్కించుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. 

 

దీనిపై స్పందించిన పూజా అవ‌న్నీ అబ‌ద్ధాలే అని కొట్టిపారేసింది. గతంలో ఇద్దరు ముగ్గురు దర్శకులు సంప్రదించినా కూడా నేను మాత్రం ఒప్పుకోలేదు క్లారిటీ ఇచ్చింది. అలాగే మ‌రోవైపు,  తెలుగు దర్శకురాలు సుధ కొంగర దర్శకత్వంలో విజయ్‌ హీరోగా నటించబోతున్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌ అంటూ వార్తలు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఇక దీనిపై కూడా అందాల భామ పూజా క్లారిటీ ఇచ్చేసింది.  తమిళ స్టార్‌ హీరో విజయ్‌కి జోడీగా త‌న‌కు అవ‌కాశాలు వ‌చ్చిన వార్త‌లు కేవ‌లం పుకార్లు మాత్రమే అని పూజా తేల్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: