బ్లాక్‌ వైట్‌ రోజుల్లో హీరోయిన్‌ అంటే చీరల్లోనే కనిపించేవారు. కానీ రాను రాను ట్రెండ్ మారింది. హీరోయిన్‌ లు సినిమాకు గ్లామర్‌ యాడ్ చేస్తున్నారు. హాట్ హాట్‌ డ్రెస్‌ లతో సినిమాలకు కమర్షియల్ ఎలిమెంట్స్‌ ను యాడ్ చేస్తున్నారు. 90ల నుంచి హీరోయిన్ అంటే సినిమాకు కేవలం గ్లామర్‌ మాత్రమే అన్నట్టుగా సాగింది. తరువాత కొన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాలు వచ్చినా మేజర్‌ గా హీరోయిన్‌ అంటే కేవలం గ్లామర్‌ ఎలిమెంట్‌ గానే చూస్తున్నారు మేకర్స్‌.

 

తాజాగా పరిస్థితి మరింతగా మారిపోయింది. ఈ జనరేషన్‌ హీరోయిన్లు కేవలం క్యారెక్టర్‌ మాత్రమే కాదు అవసరమైతే ఐటమ్‌ సాంగ్‌ కు కూడా సై అంటున్నారు. ఏదో అవకాశాల్లేని భామలు కాదు.కెరీర్‌ లో ఫుల్‌ బిజీగా ఉన్న తమన్నా, పూజా హెగ్డే, కాజల్‌ లాంటి టాప్‌ స్టార్స్‌ కూడా ఐటమ్‌ సాంగ్స్‌ లో తళుక్కు మంటున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు అంటే ఐటమ్ సాంగ్‌ కు కూడా టాప్‌ హీరోయిన్ కావాల్సిందే అని ఫిక్స్‌ అయిపోయారు దర్శక నిర్మాతలు.

 

రంగస్థలం సినిమా కోసం పూజా హెగ్డే, జనతా గ్యారేజ్‌ కోసం కాజల్‌ అగర్వాల్‌ లు ఐటమ్‌ గర్ల్స్‌ గా మారితే, తమన్నా లాంటి హీరోయిన్స్‌ అయితే చిన్న చిన్న హీరోల సినిమాల్లో కూడా స్పెషల్ సాంగ్స్ చేసి షాక్‌ ఇచ్చింది. అయితే ఇలా చేయడానికి చాలా కారణాలే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో హీరోల ఇమేజ్‌ను వారి బ్యాక్‌ గ్రౌండ్‌ ను దృష్టిలో పెట్టుకొని సినిమాలు భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా ఐటమ్‌ సాంగ్స్‌ కు ఓకె చెప్తున్నారు. మరి కొంత మంది హీరోయిన్లు నిర్మాతలు ఆఫర్‌ చేస్తున్న భారీ పేమెంట్స్‌ కు టెంప్ట్ అయి స్పెషల్ సాంగ్స్‌ కు ఓకె చెప్తున్నారు. మరికొందరు హీరోయిన్లు అవకాశాల కోసం గ్లామర్‌ ఇమేజ్‌ తో ఆకట్టుకునేందకు స్పెషల్ సాంగ్స్‌ కు సై అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: