ఏదైనా కమర్షియల్ సినిమా వస్తుంది అంటే అందులో ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే. ఐటెం సాంగ్ లేదు అంటే అది సినిమాకు కాస్త మైనస్ పాయింట్ అయినట్టే. ఇక ఎవరైనా స్టార్ హీరో సినిమాలు వస్తే అందులో ఐటమ్సాంగ్ ఉండాల్సిందే ఒక స్పెషల్ ఎంట్రీ కావాల్సిందే.  సినిమాలో నటించే హీరోయిన్ తో ఎన్ని స్టెప్పులేసిన... ఐటెం సాంగులో స్పెషల్ ఎంట్రీ ఇచ్చే ముద్దుగుమ్మలతో హీరో వేసే స్టెప్పులకు బాగా ఆకర్షితులు అవుతూ ఉంటారు ఆడియన్స్. అందుకే స్టార్ హీరోల సినిమాలు కమర్షియల్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ కంపల్సరి గా ఉంటాయి. ఇక ఐటమ్ సాంగ్స్ కోసం ఎంతగానో ప్లాన్ చేస్తుంటారు దర్శకనిర్మాతలు. ఈ మధ్యకాలంలో బాగా హిట్ అయిన ఐటమ్ సాంగ్స్ చాలా తక్కువే.. ఇలా బాగా హిట్ అయిన ఐటమ్ సాంగ్స్ లలో ఒకటి  గద్దల కొండ గణేష్ సినిమాలోని ఐటమ్ సాంగ్. 

 

 

 మెగా  ప్రిన్స్  వరుణ్ తేజ్  హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన చిత్రం గద్దల కొండ గణేష్. మొదట వాల్మీకిగా ఉన్న ఈ సినిమా టైటిల్ ని ఈ సినిమా విడుదల ఒక్కరోజు ముందు దర్శకుడు హరీష్ శంకర్ సినిమా టైటిల్ ని గద్దల కొండ గణేష్ గా మార్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో  మధ్య వయస్కుడు గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అదరగొట్టాడు. ఏకంగా భారీగా గడ్డం పెంచుకుని... డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో ... ఒక గ్యాంగ్ లీడర్ గా... తనలోని నటుణ్ణి నిరూపించుకున్నాడు వరుణ్ తేజ్. ఇక ఈ సినిమాలో హయాతి డింపుల్  ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించింది. జర్రా జర్రా  అంటూ మొదలయ్యే ఒక ఐటం సాంగ్ లో హయతి డింపుల్  తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో  అదరగొట్టింది. 

 

 

 కాగా ఈ ఐటమ్ సాంగ్ కు  శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసారు. ఇక శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసారు అంటే డాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలు హయాతి డింపుల్ తన డాన్స్ పర్ఫార్మెన్స్ లతో ఇరగదీసింది అనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో వచ్చిన ఐటమ్ సాంగ్స్ లో ప్రేక్షకులను ఎక్కువగా అలరించిన ఐటమ్ సాంగ్ గద్దలకొండ గణేష్ లో హయతి డింపుల్ చేసిన ఐటమ్  అనే సాంగ్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: