యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌.. ఈ పేరు తెలియ‌ని వారు ఉండ‌రు. కేవ‌లం తెలుగు ప్రేక్షకులకే కాదు ఇండియాలోని అన్ని ప్రాంతాల వారికి డార్లింగ్ అంటే విప‌రీతమైన అభిమానం. బాహుబలి సిరీస్ తర్వాత పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయిన ప్రభాస్‌కి దేశ‌విదేశాల్లోనూ ఫ్యాన్ ఫాలోంగ్ ఏర్ప‌డింది. డార్లింగ్‌ డార్లింగ్‌ అంటూ ఎదుటివాళ్లపై ప్రభాస్‌ చూపించే ప్రేమ, ఆయన సింప్లిసిటీ కట్టిపడేస్తోందని పలువురు బాలీవుడ్‌ తారలు సైతం మెచ్చుకున్న సంద‌ర్భాలు ఉన్నాయి. ఇక తాజాగా ప్రభాస్ వ్యక్తిత్వం గురించి ఓ సీనియర్ యాక్టర్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. 

 

ఎస్. ఎస్. రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్‌, శ్రియా హీరోహీరోయిన్లుగా న‌టించిన చిత్రం ఛత్రపతి. 2005లో విడుద‌లైన ఈ చిత్రంలో నటించిన శేఖర్ గుర్తున్నాడా..? చత్రపతిలో ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్‌గా కనిపించి.. ఇంటర్వెల్ అప్పుడు చనిపోయే పాత్రలో నటించాడు శేఖర్. మ‌రియు రాజమౌళి సినిమాల్లో దాదాపు అన్నింట్లోనూ ఈయన నటించాడు. అయితే ఈయ‌న ఛత్రపతి సినిమా షూటింగ్ స‌మ‌యంలో జ‌రిగిన ఓ సంఘ‌న‌ట గురించి చెప్పుకొచ్చాడు.  ఓ రోజు షూటింగ్ కోసం సముద్రంలోకి వెళ్లామని.. ప్రభాస్ ఇంట్రో సీన్ కోసం ఒడ్డు కనబడకూడదని.. సముద్రం మధ్యలోకి వెళ్లాల్సి వచ్చిందని చెప్పాడు శేఖర్.

 

అప్పుడు నేను నీటిలోంచి పైకీ లేచే సీన్‌లో పట్టు తప్పి మునిగిపోబోయాను. అప్పుడు ప్రభాస్ నన్ను గట్టిగా పట్టుకున్నాడు. ఆ సమయంలో నాకు ఊపిరి ఆడకపోవడంతో చనిపోతా అనుకున్నా అని చెప్పుకొచ్చాడు. ఇక ప్రభాస్ నన్ను గట్టిగా పట్టుకోక‌పోయింటే.. బోటు కింద ఉండే ఫ్యాన్‌కు తగిలేవాడిని. అప్పుడు నేను గాయపడి చనిపోదును. అందుకే ప్రభాస్ నన్ను వదలకుండా పట్టుకున్నాడు.  ఆ రోజు తనకేమైనా అవుతుందేమో అని ప్రభాస్ పడిన తాపత్రయం అంతా ఇంతా కాదని అవేద‌న వ్య‌క్తం చేశారు శేఖర్. మ‌రియు ఆ రోజు ప్ర‌భాస్ లేక‌పోతే నేను చ‌నిపోయేవాడిన‌ని.. ప్ర‌భాస్‌ను, ఆ సంఘ‌ట‌న‌ను గుర్తుచేసుకున్నాడు శేఖ‌ర్‌.

 
 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: