సినీ రంగంలో సెంటిమెంట్లను ఓ రేంజ్‌లో ఫాలో అవుతుంటారు. అందుకే ఓ ఫార్ములా సక్సెస్ కావటంతో మిగతా దర్శక నిర్మాతలు కూడా అదే ఫార్ములను ఫాలో అయిపోతారు. అలాంటి ఓ సక్సెస ఫార్ములానే ట్రైన్‌లో ఐటమ్ సాంగ్. 90లలోనే మన మేకర్స్‌ ట్రైన్‌లో ఐటమ్‌ సాంగ్ అనే ట్రెండ్‌ను స్టార్ట్‌ చేసి సక్సెస్ అయ్యారు. ఈ సాంప్రదాయాన్ని మొదలు పెట్టిన దర్శకుడు మణిరత్నం. బాలీవుడ్‌ బాద్‌ షా షారూఖ్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన దిల్ సే సినిమా కోసం ట్రైన్‌లో ఐటమ్‌ సాంగ్‌ను తెరకెక్కించాడు మణి.

 

బాలీవుడ్‌ హాట్‌ బాంబ్ మలైకా అరోరా ఆడిపాడిన ఈ పాట అప్పటికీ ఇప్పటికీ సెన్సేషనే. అదే టైంలో వచ్చిన మరో ఐటమ్ సాంగ్‌ చిన్నదానా..  అజిత్ హీరోగా తెరకెక్కిన ప్రేమలేఖ సినిమాలోని చిన్నదానా ఓసి చిన్నదానా పాట అప్పట్లో ఓ రేంజ్‌లో సక్సెస్ అయ్యింది. ఇక ఈ జనరేషన్‌ను ఊపేసిన రైలు పాటు అ అంటే అమలాపురం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆర్య. ఈ సినిమాలో అభినయ శ్రీ ఆడి పాడిన అ అంటే అమలాపురం పాట ఓ రేంజ్‌లో హిట్ అయ్యింది.

 

అదే ఫార్ములాను కంటిన్యూ చేస్తూ ఎన్టీఆర్ కూడా ఓ ఐటమ్‌ సాంగ్ చేశాడు. నరసింహుడు సినిమాలో ట్రైన్‌లో ఐటమ్‌ సాంగ్‌ లో ఆడిపాడాడు. అంతేకాదు ఈ పాటలో అప్పటి స్టార్ హీరోయిన్‌ ఆర్తి అగర్వాల్ ఆడిపాడటం విశేషం. అయితే అన్ని సార్లు సెంటిమెంట్లు వర్క్‌ అవుట్ కావు. అందుకే నరసింహుడు సినిమాలో ట్రైన్‌లో ఐటమ్ సాంగ్‌ ఉన్నా.. సినిమా మాత్రం సక్సెస్ కాలేదు. ఈ జనరేషన్‌లో కూడా ఓ ట్రైన్‌ స్పెషల్ సాంగ్ ఉంది. విజయ్‌ దేవరకొండ నిర్మాతగా మారి తెరకెక్కించిన ఈ సినిమా మీకు మాత్రమే చెప్తా. ఈ సినిమా ప్రమోషన్‌ కోసం విజయ్‌ దేవరకొండ ఓ స్పెషల్ సాంగ్ చేశాడు. ఆ పాటను కూడా ట్రైన్‌లో చిత్రీకరించటం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: