అక్కినేని వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అక్కినేని అఖిల్ పలు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఇప్పుడు వరకు హిట్ సాధించలేకపోయాడు... దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని బొమ్మరిల్లు భాస్కర్ తో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలు ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరో గా  కొనసాగుతూ వరుస విజయాలను సొంతం చేసుకుంటూ... ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పూజాహెగ్డే అఖిల్ కు జోడిగా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్  సినిమా వస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి లాస్ట్ షెడ్యూల్ చిత్రబృందం అఖిల్ పూజా హెగ్డే మధ్య ఓ రొమాంటిక్ చిత్రీకరించారట. 

 

 

 

 అఖిల్ పూజా హెగ్డే ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని వీరిద్దరి రొమాన్స్ సినిమాలో హైలెట్ గా  నిలుస్తుంది అంటూ చిత్రబృందం ఎంతో నమ్మకంగా ఉంది. ఇక బొమ్మరిల్లు భాస్కర్ సినిమా అంటే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి అన్న విషయం తెలిసిందే ఇక ఈ సినిమాలో కూడా అలాంటి ఎమోషన్స్ తో పాటు  ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా ఉంటుంది టాక్ వినిపిస్తోంది. అయితే అక్కినేని వారసుడు అఖిల్ ఇప్పటివరకు అఖిల్, హలోమిస్టర్ మజ్ను సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అవి డిజాస్టర్ గానే మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో అఖిల్ తన నాలుగో చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇక అటు వరుస విజయాలతో దూసుకుపోతున్న పూజా హెగ్డే లక్కు  కూడా ఈ సినిమాకు కలిసి వస్తుందని చిత్ర బృందం చేస్తున్నారట. 

 

 

 

 ఎందుకంటే ప్రస్తుతం పూజా హెగ్డే పట్టుకున్నదల్లా  బంగారం అయినట్లు చేసిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తూ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి. ఎన్టీఆర్ తో నటించిన అరవింద సమేత, మహేష్ బాబు తో నటించిన మహర్షి, మొన్నటికి మొన్న అల్లు అర్జున్ తో నటించిన అల వైకుంఠ పురములో సినిమాలు సంచలన విజయాలను నమోదు చేయడంతోపాటు ఒక రేంజ్ లో వసూళ్లను రాబట్టాయి. దీంతో పూజా హెగ్డే క్రేజ్  ఎక్కడికో వెళ్ళిపోయింది. అందుకే ఈ అమ్మడి లక్కు కాస్త అఖిల్ సినిమాకు కలిసొచ్చే అవకాశం ఉంది అంటున్నారు అటు ప్రేక్షకులు. మరోవైపు అఖిల్ కూడా ఈ సినిమా విషయంలో చాలా గ్యాప్ తీసుకుని మంచి కథను అనుకున్న తర్వాతనే సినిమాకు ఓకే చేసాడు. ఇక బొమ్మరిల్లు భాస్కర్ కూడా మంచి సినిమాలు తీస్తాడనే నమ్మకం ప్రేక్షకుల్లో ఉంది. దీంతో ఈ ముగ్గురి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా తప్పకుండా హిట్ సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు అక్కినేని అభిమానులు. చూడాలి మరి అఖిల్ కెరీర్  ఈ సినిమాతో ఎలాంటి  మలుపులు తిరుగుతుందో అని.

మరింత సమాచారం తెలుసుకోండి: