టాలీవుడ్ లో మిర్చి మూవీతో ప్రభాస్ కి మంచి హిట్ ఇచ్చిన కొరటాల శివ తర్వాత మహేష్ బాబు కి శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన విషయం తెలిసిందే.  రచయితగా ప్రస్థానం మొదలు పెట్టిన కొరటాల తర్వాత దర్శకుడిగా మారి వరుస విజయాలు అందుకుంటున్నారు.  మహేష్ బాబు తో చివరిగా ‘భరత్ అనే నేను’ లాంటి పొలిటిక్ డ్రామాతో సంచలన విజయం అందుకున్నాడు.  ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తో ఆయన ఓ మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పదేళ్ల విరామం తర్వాత ఖైదీ నెంబర్ 150తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి తర్వాత దేశ భక్తి నేపథ్యంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ‘సైరా నరసింహారెడ్డి’ మూవీలో నటించారు. 

 

మూవీ నాలుగు భాషల్లో కన్నడ, మళియాళ, హిందీ, తెలుగు భాషల్లో రిలీజ్ చేశారు.  తెలుగు లో తప్ప ఈ మూవీ ఇతర భాషల్లో అంతగా ఆడలేదు.  ప్రస్తుతం మరో కమర్షియల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావాలని చూస్తున్న తరుణంలో కొరటాలతో ఓ మూవీ కమిట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ షరవేగంగా జరుగుతుంది.  దేవాలయాల మాఫియా నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో చిరంజీవి బ్యాగ్ గ్రౌండ్ లో నక్సల్ పాత్రలో కనిపిస్తున్నట్లు సమాచారం.  అంతే కాదు ఈ మూవీలో మహేష్ బాబు ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారట. 

 

అయితే చిరంజీవి అంటే డ్యాన్స్, ఫైట్స్ కి ప్రత్యేకం అంటారు.  ఖైదీ నెంబర్ 150లో ఆయన డ్యాన్స్ తో దుమ్మురేపారు.  ఇప్పుడు కొరటాల కూడా ఇదే విషయంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ విషయంలో అభిమానులు ఎలాంటి పరిస్థితుల్లోను నిరాశకి లోను కాకూడదని కొరటాల .. సంగీత దర్శకుడు మణిశర్మకి చెప్పారట. చిరూ స్టైల్ ను దృష్టిలో పెట్టుకునే ఆయన బాణీలను సమకూర్చుతున్నట్టు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: