స్టార్ హీరోయిన్ అయినా.. ఐటం సాంగ్స్ స్పెషల్ క్రేజ్ ఉన్న నటీమణి అయిన ఐటం సాంగ్స్ చేస్తున్న వారికి ఆడియెన్స్ కాస్త తక్కువ చేసి చూడటం గమనిస్తూనే ఉంటాం. ఆడియెన్స్ ను అలరించేలా స్పెషల్ గా డిజైన్ చేసే ఈ సాంగ్స్ సూపర్ హిట్ అవుతాయి. ఆడియెన్స్ కూడా ఈ సాంగ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. కాని అవి చేసే వారిని మాత్రం ఐటం అంటుంటారు. ఐటం సాంగ్స్ లేకుంటే సినిమాలు చూడరా అంటే.. సీరియస్ గానో.. లేక ఒక ఇంటెన్స్ తో నడుస్తున్న సినిమాలో సడెన్ గా ఆ మూడ్ నుండి బయటకు తెచ్చేలా ఐటం సాంగ్స్ ఉపయోగపడతాయి.

 

అయితే కొన్ని సినిమాల్లో ఇవి చాలా స్పెషల్ గా ఉంటాయి. కమర్షియల్ సినిమాల్లో ఐటం సాంగ్స్ గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. ఆడియెన్స్ మెప్పు పొందేందుకు చేసే ఈ ఐటం సాంగ్స్ రెస్పాన్స్ బాగా తెచ్చుకున్నా సరే అవి చేస్తున్న భామలని మాత్రం చిన్నచూపు చూస్తారు. వాళ్ళు అలా చేసేది కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకే అన్న విషయం మర్చిపోతున్నారు.

 

కొన్ని సినిమాల్లో మెయిన్ హీరోయిన్ కన్నా ఐటం సాంగ్ లో హీరోయిన్ చేసే గ్లామర్ షోకి ఎక్కువ మార్కులు పడతాయి. అయితే ఈమధ్య కొత్త వాళ్ళు వచ్చి ఐటం సాంగ్స్ ఎక్కువగా చెయ్యట్లేదు. ఉన్నా సరే అదేదో స్టార్ హీరోల సినిమాల్లోనే ఉంటున్నాయి. కంటెంట్ ఉన్న సినిమాలకు ఈ సాంగ్స్ అవసరం లేదు కాని ఎంటర్టైన్ సినిమాలకు మాత్రం ఐటం సాంగ్స్ చాలా అవసరం. ఇలా ప్రత్యేక గీతాలను చేసే భామలకు ఈమధ్య గడ్డు కాలం నడుస్తుంది. వచ్చిన ఒకటి అరా ఛాన్సులు హీరోయిన్ లే చేస్తుండటం విశేషం. మరి ఐటం సాంగ్స్ తో మళ్ళీ టాలీవుడ్ కళకళలాడాలని ప్రేక్షకులు కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: