మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాతో బిజీగా వున్న సంగతి అందరికి తెలిసిందే. దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం శర వేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా తరువాత రామ్‌చరణ్‌ నటించబోయే సినిమా ఏమిటన్నది అభిమానుల ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య, సుకుమార్‌, విక్రమ్‌ కె కుమార్‌ కాంబోలో ఉండవచ్చు అన్నట్లుగా వార్తలు వినిపించాయి.  

 

IHG

 

కానీ, టాలీవుడ్ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, ఈసారి రామ్‌చరణ్‌, 'ప్రదీప్‌' అనే యువ దర్శకుడితో కలిసి పనిచేయబోతున్నట్లుగా సమాచారం. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ తెరకెక్కించబోతున్నదని సారాంశం. ఇక మనం చేసుకున్నట్లైతే, రామ్‌చరణ్‌ తన కెరీర్‌లో ఇప్పటివరకు కొత్త  దర్శకుడితో వర్క్ చేసిన దాఖలాలు లేవు. మొదటి నుండి తాను సూపర్ సీనియర్ డైరెక్టర్లను ఎంపిక చేసుకొని, సినిమాలు చేస్తూ వచ్చారు. 

 

తాజాగా ఆ ప్రక్రియకు చెక్ పెడుతూ కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వడం ఇపుడు అందరిలోనూ ఒక రకమైనటువంటి చర్చకు దారితీసింది. ఇక టాలీవుడ్ నూతన దర్శకులు ఎందరో అతనితో పని చేయడానికి సిద్ధంగా వున్నారు. ఆమధ్య రంగస్థలం సినిమాతో ఓ నటుడిగా రాంచరణ్ కెరీర్ తారాస్థాయికి చేరుకుందనే చెప్పుకోవాలి. అందువలననే అప్ కమింగ్ టెక్నీషీన్స్ అతనితో వర్క్ చేయాలని తెగ ఉబలాట పడుతున్నారు.

 

IHG

 

ఇపుడు అలాంటి వారందరికీ ఇది ఒక శుభవార్త లాంటిది. ఎందుకంటే, ఈ సినిమాతో అతను కొత్త వారికి ఆహ్వానం పలికినట్టే లెక్క. అయితే,ఈ సినిమా విషయంలో నిజానిజాలేమిటో తెలియాలంటే చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సివుంది. ఇక ‘ఆర్‌ఆర్‌ఆర్‌' వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుందనే విషయం తెలిసినదే.

మరింత సమాచారం తెలుసుకోండి: