క‌థ డిమాండ్ చేస్తే ఏ హీరోయిన్ అయినా కాస్త రొమాన్స్ ఎక్కువ చేయాలి.. ఎక్స్ పోజింగ్ ఎక్కువ చేయాలి.. ఇక అవ‌స‌రాన్ని బ‌ట్టి స్టార్ హీరోయిన్లు సైతం లిప్ లాక్‌లు, బికినీలు వేయ‌డం కూడా సినిమా ఇండ‌స్ట్రీలో కామ‌న్‌. ఇది మామూలు తెలుగు సినిమాల‌కే కామ‌న్ అయిపోయింది. ఇక బాలీవుడ్‌.. హాలీవుడ్‌లో ఇంకెంత దారుణంగా ఉంటాయో చెప్ప‌క్క‌ర్లేదు. అయితే హాలీవుడ్‌లో హీరోయిన్ల‌కు అర్థ‌న‌గ్న సీన్లు, న్యూడ్ సీన్లు చాలా చాలా కామ‌న్‌. ఇలా న‌టించే సీన్ల‌ను కొంద‌రు ఏకంగా మార్ఫింగ్ చేసి పోర్న్ సైట్ల‌లో కూడా పెట్టేస్తున్నార‌ట‌.



ఈ అనుభ‌వం ఓ హాలీవుడ్ న‌టికి ఎద‌రవ్వ‌డంతో ఆమె తీవ్రంగా వాపోయింది. హలీవుడ్ నటి కీరా నైట్లే ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ ఇక‌పై తాను న‌గ్న సీన్ల‌లో న‌టించేది లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేసింది. ఇప్ప‌టికే తాను ఇద్ద‌రు బిడ్డ‌ల‌కు త‌ల్లిని అని... ఇక తాను ఏ సినిమాల్లో న‌టించినా న‌గ్న సీన్ల‌లో న‌టించ‌న‌ని.. ఆ మేర‌కే తాను ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌తో ఒప్పందం చేసుకుంటాన‌ని చెప్పింది.  కీరా నైట్లే ఇద్దరి పిల్లల తల్లి అయినా ఇప్పటికీ  నగ్న సన్నివేశాల్లో నటించాలని దర్శకులు కోరుతున్నారని చెప్పింది.



ఇక‌పై సినిమాలు ఒప్పుకునే ముందు నో న్యూడిటీ క్లాజ్ ఒప్పందం మీద సంత‌కం పెట్టించుకున్నాకే సినిమాల‌కు ఓకే చెపుతాన‌ని చెప్పింది. తాను గ‌తంలో ఎన్నో న‌గ్న సీన్లలో న‌టించాన‌ని అయితే అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేద‌ని.. ఇప్పుడు మాత్రం వాటిని పోర్న్ సైట్ల‌లో పెట్టేస్తున్నార‌ని వాపోయింది. ఈ సీన్లు చూసిన చాలా మంది త‌నను పోర్న్ స్టార్ అనుకుంటున్నార‌ని... ఒక వేళ త‌న‌కు న్యూడ్ సీన్లు త‌ప్ప‌నిస‌రి అయితే త‌న డూప్‌ల‌ను పెట్టి ఆ సీన్లు షూట్ చేయిస్తాన‌ని చెపుతోంది.



కీరా తీసుకున్న నిర్ణ‌యంతో ఆమె ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఇటీవ‌ల ఇండియన్ సినిమాల్లోనూ న్యూడిటీ ఇటీవల ఎక్కువైపోతోంది. నటి రాధికా ఆప్టే హాలీవుడ్ నటుడు దేవ్ పటేల్ కలిసి నటించిన ‘ది వెడ్డింగ్ గెస్ట్’ సినిమాలో రాధిక నగ్న సన్నివేశాల్లో నటించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: