సినిమా.. 24 కళలు ఉన్న సినిమా అంటే అందరికి ఇష్టం. ఈ సినిమాకు కావాల్సినవి రచయత.. దర్శకుడు.. నిర్మాత.. హీరో.. హీరోయిన్.. తదితర నటులు. పైన ఉన్నవారిలో ఏ ఒక్కరు లేకపోయినా సినిమా ఉండదు. రచయత.. దర్శకుడు.. నిర్మాత.. హీరో.. హీరోయిన్ అనేది ఒక నాలుగు అయితే.. తదితర నటులు అంటే ఎంతోమంది వస్తారు. 

 

ఆ నటులలో పెద్ద పాత్రలు ఉంటాయి.. చిన్న పాత్రలు ఉంటాయి. అలానే విలువ వున్నా పాత్రలు ఉంటాయి.. దిగజార్చే పాత్రలు ఉంటాయి, కొందరు డబ్బు కోసమే ఆ పాత్రలు చేస్తే మరికొందరికి వృతే ఆ పాత్రలు ఉంటాయి. సినిమాలో అన్నట్టు అవి కేవలం కల్పితం అయినప్పటికీ ఆ పాత్రలు చేసే వారిని మాత్రం చాలా చులకనగా చూస్తారు. 

 

అబ్బాయిలు అంటే ఏ పాత్రలు చేసిన.. ఎన్ని అవమానాలు చేసిన పెద్దగా ఫీల్ అయ్యేది ఉండదు కానీ.. అమ్మాయిలు కొన్ని పాత్రల్లో నటిస్తే మాత్రం ఆ అమ్మాయిని అష్టకష్టాలకు గురి చేస్తారు.. అలా అమ్మాయిలు నటించే పాత్రలలో.. వేశ్య పాత్ర అయినా.. ఐటెం గర్ల్స్ పాత్ర అయినా మరేదైనా సరే ఆ పాత్రలలో చేసే వారిని అష్టకష్టాలకు గురి చేస్తారు. 

 

అలా గురి చేసిన వారికీ మరి దారుణంగా అంటే ఐటెం గర్ల్స్ ని మరి దారుణంగా చులకనగా చూస్తారు.. అప్పట్లో ఐటెం గర్ల్స్ అంటే చాలు వారు ఏదో పెద్ద పాపం చేసినట్టు ఫీల్ అయిపోయేవారు.. ఎందరో ప్రేక్షకుల మనసు దోచిన వారిని ఇండస్ట్రీలోను చులకనగానే చూడటం.. బయట ప్రజలు చులకనగానే చూస్తారు. 

 

ఇప్పుడు అలాంటి ఐటెం గర్ల్స్ గా హీరోయిన్స్ ఏ మారుతున్న పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఆ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్ ఐటెం సాంగ్ కు స్టెప్పులు వేసింది అంటే ఆహా.. ఓహో అని చూస్తున్నారు. ఏమైతేనేం.. ఐటెం గర్ల్స్ అంటే ఇప్పుడైనా చులకన భావన పోయి ఇష్టం పెరిగినందుకు కాస్త సంతోషించాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: