తెలుగు ప్రేక్షకులని దేశముదురుతో మెప్పించింది. ఆమె మొదటి సినిమాతోనే ప్రజలని గెలుచుకోవడం సాధ్యం అయ్యిపోయింది హన్సికకి. హన్సిక చిన్నతనం నుండే వివిధ సినిమాలలో, సీరియల్స్ లో నటించింది. ఆమె చిన్నతనంలో చైల్డ్ యాక్టర్ గా చిన్న పాత్రలు సినిమాల్లో, సీరియల్స్ లో చేసి మంచి స్థానం సంపాదించుకుంది ఈ నటి. ఆ తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన అల్లు అర్జున్ దేశముదురులో నటించి  తెలుగు వారికి పరిచయం అయ్యింది. ఆ సినిమాలో హిట్ అందుకుని సినిమా వైపు కొనసాగింది హన్సిక.

 

IHG

ఆమె ఆ తర్వాత మరెందరో టాప్ హీరోలతో నటించింది. ఎన్టీఆర్ సరసన కంత్రీ సినిమాలో నటించి మరో మంచి స్థానం దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. వివిధ పాత్రలని చేసి ప్రేక్షకులని ముగ్ధులని చెయ్యడమే కాక మంచి సినిమా జర్నీని ప్రారంభం చేసింది. ఈ హాట్ నటి హీరో రాం సరసన నటించి మస్కా సినిమాలో మంచి నటన అందించింది. నిజంగా ఈమె అందానికి ఎవ్వరైనా ఫిదానే. 

 

 

ఎంతో మందిని రెచ్చకొట్టే ఈ భామ తన మనసు పారేసుకుందన్న వార్తలు కూడా వినిపించాయి. అయితే ఆమె మనసు శింభుకి ఇచ్చేసింది అని తానే స్వయంగా చెప్పేసింది. వాళ్ళిద్దరూ లవ్ లో  ఉన్నట్లు ఆమె నోటితో ఆమె చెప్పింది. కానీ ఆ లవ్ కధ తుస్సుమనడంతో సినిమా, కెరీర్ పై దృష్టిపెట్టడం మంచిదంటూ రూట్ మార్చేసింది ఈ బ్యూటి. 

 

 

ఎల్లోరా శిల్పాన్ని వస్తున్నా నీకేసి.. నాలో అందాలన్నీ అందిస్తా పోగేసి... అంటూ ప్రభాస్ తో బిల్లా సినిమాలో హన్సిక ఒక్క ఊపు ఉపేసింది. ఈ పాటతో హన్సిక ప్రేక్షకులకి తన అందాన్ని చూపిస్తూ హాట్ హాట్ స్టెప్స్ వేసింది. ఇలా బిల్లాతో హన్సిక ఎంతగానో ఆకట్టుకుంది అద్దిరిపోయే స్టెప్పులు వేసి. 

మరింత సమాచారం తెలుసుకోండి: