శ్రీయ ఎంతో మంచి నటి. స్టార్ హీరోలతో నటించిన ట్యాలెంట్ ఉన్న యాక్టర్ శ్రీయ. ఈమె ఎన్నో సినిమాలలో నటించింది. చక్కటి యాక్టింగ్ తో ఎంతో బాగా ఆకట్టుకునే నటి మన శ్రీయ. ఈమె కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాక హిందీ, తమిళ్, మళయాలం సినిమాల్లో కూడా నటించింది. ఇలా శ్రీయ ప్రేక్షకులకి దగ్గరైపోయింది.

 

 

ఎన్నో అవార్డులు కూడా గెలుచుకున్న నటి ఈమె. గుట్టు చప్పుడు కాకుండా చేసుకున్న వివాహం చర్చకి దారి తీసింది. ఈమె వివాహం అప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. శ్రీయ రష్యాకి చెందిన వ్యక్తిని రాజస్థాన్ లో పెళ్ళి చేసుకుంది. ఎవరికీ తెలియకుండా కొంత మందితో మాత్రమే చెప్పి ఎంతో గుట్టుగా ఆండ్రూని వివాహం చేసుకుంది. ఆ తర్వాత మాత్రం ప్రేక్షకులతో పంచుకుంది. తన భర్త ఎంతో మంచి పార్ట్నర్ అని పొగిడింది హీరోయిన్ శ్రీయ. భర్త కంటే పార్ట్నర్ అని అనడం కరెక్ట్ అని ఆమె షేర్ చేసుకోవడమే కాక ఆమెకి తన భర్తపై ఎంతో ప్రేమ ఉందంటూ.. తను కష్టసుఖాల్లో చక్కటి ప్రోత్సాహం ఇస్తాడు అని కూడా శ్రీయ చెప్పుకొచ్చింది. 

 

 

శ్రీయ అనేక సినిమాలు తీసింది. అలానే మంచి హాట్ డాన్స్ కూడా అందించింది, ఐటం సాంగ్ చేసింది. హీరో వెంకటేష్ తో కలిసి శ్రీయ ఐటం సాంగ్ చేసింది. నిజంగా ఆమె బ్యూటి నార్మల్ గానే  పీక్స్ లో ఉంటుంది. మరి ఐటెం సాంగ్ చేస్తే ఇంక ట్రిపుల్ అయ్యిపోతుంది ఆమె అందం. "నే చుకుచుకు బండిని రోయ్.." అంటూ శ్రేయ వెంకటేష్ తో తులసి సినిమాలో చిందులేసింది. అదిరిపోయే స్టెప్పులతో ఆమె తన ఫ్యాన్స్ కి నిద్ర పట్టకుండా చేసింది. ఇలా శ్రీయ మంచి ఊపు తెప్పించింది ఐటం సాంగ్ తో.

మరింత సమాచారం తెలుసుకోండి: