విజయ్ కెరీర్ ప్రస్తుతం డైలమాలో ఉంది. పెద్ద హిట్ లేదు.. అలా అని భారీ డిజాస్టర్లు లేవు. అసలు గీతగోవిందం తర్వత వచ్చిన నోటా, టాక్సీవాలా, డియర్ కామ్రేడ్ ఏవీ పెద్ద హిట్ అవ్వలేదు.  ఎందుకంటే.. అందరికన్నా డిఫరెంట్ గా సినిమాలు చెయ్యాలనుకుని ప్రయోగాలు చేస్తున్న విజయ్ దేవరకొండ.. సబ్జెక్ట్ సెలక్షన్లో ఎక్కడో మిస్ ఫైర్ అవుతున్నాడు. అందుకే ఈ సారి అలా అవ్వకుండా ఆశలన్నీ ఆ డైరెక్టర్ మీదే పెట్టుకున్నాడు.  

 

 

ఏ క్రేజ్.. మ్యాజిక్ తో.. ఆడియన్స్ ని విజయ్ ఎట్రాక్ట్ చేశాడో.. ఇప్పుడు అదే మ్యాజిక్ ఆడియన్స్ కి మొనాటనీ అనిపిస్తోంది. రాను రానూ విజయ్ సినిమాలకు సక్సెస్ రేట్ తగ్గుతోంది.. దాంతో పాటే క్రేజ్ కూడా  తగ్గుతోంది. బ్రాండింగ్ మీద, సెన్సేషన్ మీద కాన్సన్ ట్రేట్ చేస్తున్న విజయ్.. ఇప్పుడు అలర్ట్ అవుతున్నాడు. అందుకే ఇంతకుముందు స్టార్ట్ చేసిన సినిమాలను పక్కన పెట్టి అర్జెంట్ హిట్ కోసం పూరీ నే నమ్ముకున్నాడు. 

 

 

మొన్న మొన్నటి వరకూ వరుసఫ్లాపులతో ఉన్న పూరీ.. ఇస్మార్ట్ శంకర్ తో సూపర్ హిట్ కొట్టాడు. వరుసగా ఫ్లాపులు ఫేస్ చేస్తున్న విజయ్.. రీసెంట్ గా వరల్డ్ ఫేమస్ లవర్ తో మరో ఫ్లాప్ ని కెరీర్ కి యాడ్ చేసుకున్నాడు. అంతకుముందే డియర్ కామ్రేడ్ సినిమా అనుకున్నంత హిట్ అవ్వకపోవడంతో.. వర్కింగ్ లో ఉన్న  హీరో సినిమాను పక్కకుపెట్టి వరల్డ్ ఫేమస్ లవర్ మీదే కాన్సన్ ట్రేట్ చేశాడు. అది కూడా దెబ్బేసింది. 

 

 

విజయ్ కి ప్రస్తుతం హిట్ అత్యవసరం. అందుకే  పూరీ దేవుడిలా కనిపిస్తున్నాడు. ఫ్లాపుల్లో ఉన్న రామ్ కి ఇస్మార్ట్ శంకర్ తో బంపర్ హిట్ ఇచ్చాడు. ఇప్పుడు విజయ్ కి కూడా అలాంటి హిట్టే అవసరం. అందుకే  అసలు ఫస్ట్ పూరీ తో సినిమా వద్దనుకున్న విజయ్ ఇప్పుడు ఆశలన్నీ పూరీ మీదే పెట్టుకున్నాడు. రీసెంట్ గా హీరోయిన్ గా అనన్య ని ఫైనల్ చేసి పూరీ కూడా తన స్టైల్లో సినిమాని చకచకా పరిగెత్తించేస్తున్నాడు.

 

 

 

ఫైటర్ సినిమాని స్టార్ట్ చేసి  అప్పుడే షెడ్యూల్ ఫినిష్ చేసి రెండో షెడ్యూల్ కూడా స్టార్ట్ చేసేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించి ప్రొఫెషనల్ ట్రెయినింగ్ ని థాయిలాండ్ లో నేర్చుకున్న విజయ్ ఫిజికల్ ఫిట్ నెస్ తో పాటు టోన్డ్ బాడీ కోసం ట్రెయిన్ అవుతున్నాడు.  బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తో ముంబయ్ లో మొదలు పెట్టిన ఈ సినిమా ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతోంది. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్ తో  తీస్తున్నారు. ఈసారైనా బంపర్ హిట్ ని అకౌంట్ లో వేసుకోవాలని పూరీ మీదే ఆశలు పెట్టుకున్నాడట విజయ్.

మరింత సమాచారం తెలుసుకోండి: