ప్రేమ మీద వయసు ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రేమ ఒక్కొక్క ఏజ్ లో ఒక్కోలా ఉంటుంది. తెలుగులో ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా చాలా సినిమాలు వచ్చాయి. ఆ కోవలోనే పదిహేను, పద్దెనిమిది, ఇరవై నాలుగు వయసులలో ప్రేమ దాని పర్యవసానాల మీద అద్భుతమైన కథా కథనాలతో తెరకెక్కుతున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ '15-18-24లవ్ స్టోరీ'. మాడుపూరి కిరణ్ కుమార్ దర్శకత్వంలో మాజేటి మూవీ మేకర్స్ కిరణ్ టాకీస్ పతాకాలపై స్రవంతి ప్రసాద్, కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాహుబలి ఫేమ్ నిఖిల్ దేవాదుల‌, కీర్తన్, ఉపేందర్, సాహితి, సిమ్రాన్ సానియా, పారుల్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. కాగా హోళీ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన సెకండ్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.

 

ఈ డిఫరెంట్ లవ్ స్టోరీకి సంబందించిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఫిబ్రవరి 14 వేలంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా విడుదల చేయబడి ప్రేక్షకుల ఆదరణ పొందిన సంగతి తెలిసిందే.  దర్శకుడు మాడుపూరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ – లేటెస్ట్‌గా ఎఫ్‌2, అశ్వథ్ధామ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మెహ్రిన్ మా చిత్రంఫస్ట్ పోస్టర్ విడుదల చేయడం హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా మా యూనిట్ తరపున ఆమెకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా.

 

ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కి తప్పకుండా మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాం. కథానుగుణంగా కులుంమనాలి, గోవా,ఒంగోలు, కేర‌ళ‌, హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలోని ప‌లు అందమైన లొకేషన్స్ లో షూటింగ్ జరిపాం.వైవిధ్యమైన కథా కథనాలతో సాగే ఈ చిత్రానికి ఒక భారీ యాక్సిడెంట్ హైలెట్ గా నిలుస్తుంది. ఇటీవ‌ల‌ ఈ సన్నివేశాన్ని ఫైట్ మాస్టర్ విజయ్ నేతృత్వంలో రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరించడం జరిగింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం” అన్నారు.   నిఖిల్ (బాహుబలి ఫేమ్), కీర్తన్, ఉపేందర్, సాహితి, సిమ్రాన్ సానియా, పారుల్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి   సహనిర్మాతలు: బి వి శ్రీనివాస్, బొద్దుల సుజాత శ్రీనివాస్,  నిర్మాతలు: స్రవంతి ప్రసాద్, కిరణ్ కుమార్,దర్శకత్వం: మాడుపూరి కిరణ్ కుమార్.

మరింత సమాచారం తెలుసుకోండి: