తమిళ స్టార్ హీరో సూర్య కి తమిళంలో పాటు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉండేది. కానీ గతకొన్నేళ్లుగా సూర్య సినీ లైఫ్ లో  మార్పు వచ్చింది. తెలుగులో ఆశించినంత  విజయాలు లేక డీలా పడ్డాడు. ఈ మధ్యన సూర్య నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సరిగా పర్ఫామ్ చేయడం లేదు. తాజాగా సూర్య మరో సినిమాకు ఓకే చెప్పాడు.అయితే వరుస ఫెయిల్యూర్స్‌తో తెలుగులో సూర్య మార్కెట్ క్రమంగా పడిపోయింది. 

 

 

ఈ ఇయర్ సూర్య నటించిన ‘NGK’, ‘బందోబస్త్’ సినిమాలకు కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదంటూ పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇపుడున్న పరిస్థితుల్లో సూర్య ‘గురు’ ఫేమ్ సుధ కొంగర దర్శకత్వంలో ‘సూరారై పొట్రు’ అనే తమిళ సినిమాలో నటించడానికి ఓకే చెప్పాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసారు. ఈ ఫస్ట్ లుక్‌లో స్లీవ్ లెస్ టీ షర్టు వేసుకొని.. గాల్లో ఎగురుతూ ఉన్న సూర్య పోస్టర్ బాగుంది. అంతేకాదు గాల్లో గాగుల్స్‌తో సూర్య లుక్స్ ట్రెండీగా ఉంది. తెలుగులో  ఈ సినిమాకు ‘ఆకాశమే నీ హద్దురా’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు.

 

 

ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరో మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు.  ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రల్లో అపర్ణ..జాకీష్రాఫ్,పరేష్ రావల్ ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఈ  సినిమాను 2D ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్య నిర్మిస్తున్నాడు. అయితే  వచ్చే యేడాది సమ్మర్‌లో ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ప్రచార చిత్రాలతో ప్రేక్షకులందరికీ తెలిసేలా వినూత్నంగా ప్రచారం చేస్తున్నాడు. ఇటీవలే ఎగిరే విమానంలో తొలి లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేసారు.

 


ఆ కార్యక్రమంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా పాల్గొన్నారు. మోహన్ బాబు కూడా సినిమాల్లో నటిస్తున్నారు  తాజాగా సెకెండ్ లిరికల్ సాంగ్ ``సిత్రమైనా భూమి...`` అంటూ సాగే పాటను రిలీజ్ చేసారు. ఇందులో సూర్య పక్కా మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు.ఒక పక్కా క్లాస్ లుక్ మరో పక్కా మాస్ లుక్ లో సూర్యని చూడడానికి ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు... అయితే ఈ సినిమా అయిన హిట్ అయ్యిద్దో లేదో చూడాలి...

మరింత సమాచారం తెలుసుకోండి: