అందం చందం కలగలిపిన ముద్దుగుమ్మ కియారా అద్వాని. కేవలం బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. ప్రస్తుతం బాలీవుడ్లో వరుస సినిమాలు చేసుకుంటూ బిజీబిజీగా గడుపుతోంది. ఇక టాలీవుడ్ ప్రేక్షకుల్లో  కూడా మంచి గుర్తింపు సంపాదించింది ఈ ముద్దుగుమ్మ. మహేష్ బాబు హీరోగా వచ్చిన భరత్ అనే నేను అనే సినిమాలో నటించి తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో వచ్చిన  వినయ విధేయ రామ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇక ఈ సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొందక పోయినప్పటికీ ఈ ముద్దుగుమ్మ అందానికి  మాత్రం అందరూ మంత్రముగ్ధుల్ని అయిపోయారు. కనీసం కొంచెం కూడా బ్రేక్ తీసుకోకుండా వరుసగా సినిమాలు చేస్తున్నది  ఈ ముద్దుగుమ్మ. 

 


 ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్లతో అభిమానులకు అలరిస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ ఓ  ఇంటర్వ్యూకు హాజరు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటూ. ముఖ్యంగా తన పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంది కియారా అద్వాని. తాను ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది చెప్పేసింది. తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి ఎప్పుడూ సరదాగా ఉండాలని... ఎలాంటి సందర్భంలో అయినా జోవియల్ గా  ఉండేవాడు తనకు ఎంతగానో నచ్చుతాడు అంటూ చెప్పుకొచ్చింది. 

 

 నా అభిప్రాయాలను నా ఆలోచనలకూ విలువనిచ్చే వ్యక్తి నాకు భర్తగా రావాలి అని కోరుకుంటున్నాను అంటూ జరుగుతుంది. ముక్కు మీద కోపం ఉండి ఊరికే కోప్పడే వ్యక్తి అయితే నాకు అసలు వద్దు అంటూ తెలిపింది. ఎందుకంటే అగ్రెసివ్ క్యారెక్టర్ అయితే నాకు సెట్ అవ్వదు అని... అలాంటి వాడిని నేను కోరుకోవడం లేదు అంటూ చెప్పుకొచ్చింది. అయితే తెలుగులో సెన్సేషనల్ విజయాన్ని సాధించి ట్రెండ్ సృష్టించిన సినిమా గా నిలిచిన అర్జున్ రెడ్డి సినిమా హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా  నటించగా ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్ కావడంతో కియారా క్రేజ్  కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే ఈ సినిమాలో హీరో పాత్ర ఎప్పుడూ ప్రతి చిన్న విషయానికి అగ్రెసివ్  ఫీల్ అవుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కబీర్ సింగ్ పాత్రలో అర్జున్ రెడ్డి ని దగ్గరగా చూడడం వల్ల కియారా అద్వానీ ఇలా కోపం గా ఉండే వ్యక్తి వద్దు అనుకుంటుందా అని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: