అల్లు అర్జున్‌ హీరోగా బోయిపాటి ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన సరైనోడు సినిమాలో గ్లామరస్‌ ఎమ్మెల్యేగా ఆకట్టుకున్న బ్యూటీ కేథరిన్‌ థ్రెస్‌.  అయితే ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు కొన్ని సరిగా అలరించకపోవడంతో ఈ భామకు తెలుగులో అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. అయితే కోలీవుడ్‌లో మాత్రం ఇంట్రస్టింగ్‌ సినిమాలతో స్టార్‌ హీరోయిన్‌గా ఆకట్టుకుంటోంది. ఇక తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో ఓ పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. 

 

అలాగే ఈ బ్యూటి.. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోయిగా బోయ‌పాటి తెర‌కెక్కించిన జ‌య‌జాన‌కి నాయ‌క చిత్రంలో ఓ స్పెష‌ల్ ఐటెం సాంగ్‌తో అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఈ సినిమాలో  బెల్లంకొండ శ్రీనివాస్ స‌ర‌స‌న రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టించింది. ఇక ఈ చిత్రంలో  “ఏ ఫర్ యాపిలూ ..” అంటూ సాగే ఈ ఐటమ్ సాంగ్ లో సూపర్ హాట్ లుక్ తో.. అది కూడా బుర‌ద‌లో కేథరిన్ రెచ్చిపోయింది. హాట్ అండ్ సెక్సీ అందాలతో ఆమె వేసిన స్టెప్స్ కి కుర్రకారు అప్ప‌ట్లో ఫిదా అయిపోయారు. అంతేకాకుండా, మాస్ ఆడియన్స్ ను థియేటర్ కి రప్పించడానికి ఈ ఒక్క సాంగ్ చాలు అన్న కామెంట్స్ కూడా వినిపించాయి.

 

దేవి శ్రీ ప్రసాద్ అందించిన బీట్‌కు.. కేథ‌రిన్ అందాలు తోడైన‌.. ఈ సాంగ్ కుర్రకారులో ఉత్సాహాన్ని రేకెత్తించార‌నే చెప్పాలి. అయితే ఈ సినిమాలో   ఐటెమ్ సాంగ్ చేయ‌డానికి కారణం బోయపాటి అని.. అతడి ఆఖరి చిత్రం 'సరైనోడు'లో ఎమ్మెల్యేగా నాకు మంచి రోల్ ఇచ్చారు కాబట్టి ఆయన తదుపరి సినిమాలో స్పెషల్ సాంగ్ చేశానని చెప్పుకొచ్చింది కేథరిన్. అలా బోయ‌పాటి కోసం బుర‌ద‌లో చిందులేసింది కేథ‌రిన్‌. అలాగే ఈ ఒక్క సినిమాకు మాత్రం పరిమితం తప్ప మరే ఇతర సినిమాల్లో కూడా ఐటెమ్ సాంగ్స్ లో నటించ‌న‌ని తేల్చి చెప్పింది కేథరిన్. 

మరింత సమాచారం తెలుసుకోండి: