టాలీవుడ్ మార్కెట్ అనేది ఈ మధ్య కాలంలో భారీగా పెరిగింది అనే మాట అక్షరాలా నిజం. ఈ మధ్య హీరోలు, నిర్మాతలు అందరూ కమర్షియల్ గా ఆలోచించడం తో తెలుగు సినిమా మార్కెట్ అనేది భారీగా పెరుగుతుంది ఈ మధ్య కాలంలో అనేది అందరికి తెలిసిన విషయమే. ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మీదే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఆ సినిమా హిట్ అయితే చాలు సదరు హీరోకి తిరుగు ఉండదు అనే భావన నెలకొంది. దీనితో దర్శకులు కూడా ఆ విధంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. 

 

ప్రస్తుతం టాలీవుడ్ మార్కెట్ పెరగడంతో ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కన్నేసినట్టు సమాచారం. టాలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమా అయి స్టార్ హీరోతో సినిమా అయితే తాను చేస్తా అని తాను నిర్మాతగా కూడా వ్యవహరిస్తా అని ఆ హీరోయిన్ ఎక్కువగా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. వాస్తవానికి ఆమె ట్రిపుల్ ఆర్ సినిమాలో చెయ్యాలని భావించింది. కాని ఆ సినిమాలో మరో బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకున్నారు. ఇక తాను సినిమాను పాన్ ఇండియా వైడ్ గా కచ్చితంగా తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేస్తా అని చెప్తున్నట్టు సమాచారం. 

 

అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో తనకు అవకాశం ఇవ్వాలని కూడా ఆమె కోరినట్టు సమాచారం. అయితే నిర్మాత మాత్రం అందుకు అంగీకరించలేదు అంటున్నారు. ఇదిలా ఉంటే సదరు హీరోయిన్ కొన్ని రోజులుగా హైదరాబాద్ లో ఉంటుంది అని అంటున్నారు. వరుస అవకాశాలు బాలీవుడ్ లో వస్తున్నా సరే... టాలీవుడ్ లో స్టార్ హీరోలతో ఆమె సినిమా చెయ్యాలని భావించడం మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అనే చెప్పాలి. మరి ఆమెకు ఏ విధంగా అవకాశాలు ఇస్తారు, ఏ సినిమాలో ఇస్తారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: