టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి పేరు గడించిన సీనియర్ హీరో అర్జున్, ప్రస్తుతం అక్కడక్కడా సినిమాల్లో విలన్ పాత్రల్లో కూడా నటిస్తున్నారు. ఇక అయన కుమార్తె ఐశ్వర్య అర్జున్, ఇటీవల తమిళ యాక్షన్ హీరో విశాల్ సరసన ధీరుడు సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో పెద్దగా సక్సెస్ కాని ఆ సినిమా, తమిళ్ లో మాత్రం మంచి సక్సెస్ ని అందుకుంది. కానీ దాని అనంతరం ఐశ్వర్యకు పెద్దగా అవకాశాలు అయితే రాలేదనే చెప్పాలి. 

 

ఆ తరువాత ఒక కన్నడ సినిమాలో కూడా నటించి తన అందం, అభినయంతో ఆకట్టుకున్న ఐశ్వర్య, ఆ సినిమా ద్వారా కూడా పెద్దగా పేరు సంపాదించలేకపోయింది. అయితే ఎలాగైనా తన కూతుర్ని హీరోయిన్ గా మంచి స్థానంలో నిలబెట్టడానికి స్వయంగా అతి త్వరలో అర్జున్ రంగంలోకి దిగబోతున్నారని టాక్. మరికొద్దిరోజుల్లో ఐశ్వర్య హీరోయిన్ గా ఒక టాలీవుడ్ స్టార్ హీరోతో అర్జున్ స్వయంగా తన ఓన్ ప్రొడక్షన్ లో భారీ సినిమాని నిర్మించనున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే ఆ సినిమా విషయమై పలువురు కథకులు, దర్శకులను సంప్రదించే పనిలో పడ్డ అర్జున్, ఇటీవల ఫైనల్ గా ఒక దర్శకుడు చెప్పిన కథకు ఓటేశారని, ప్రస్తుతం ఆ కథ యొక్క పూర్తి స్క్రిప్ట్ సిద్ధం అవుతోందని, అన్ని అనుకున్నట్లు జరిగితే, రాబోయే మరొక నెల రోజుల్లో ఆ సినిమా సెట్స్ మీదకు కూడా వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. 

 

అయితే అర్జున్ నిర్మించబోయే ఆ సినిమాలో నటించబోయే స్టార్ హీరో ఎవరు అనే విషయమై మాత్రం ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చలు జరుగుతున్నాయట. కాగా ఇటీవల మంచి విజయాలతో దూసుకెళ్తున్న యంగ్ హీరో ఆమె సరసన నటించడానికి సిద్ధం అయ్యారని వినికిడి. మరి ఆయన ఎవరో ఏమిటో తెలియాలంటే మాత్రం మరికొన్నాళ్లు ఓపికపట్టాల్సిందే అంటున్నారు....!!

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: