నందమూరి ఫ్యామీలీ నుంచి వచ్చిన హీరోల్లో బాలకృష్ణ తర్వాత ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు జూ.ఎన్టీఆర్.   నందమూరి హరికృష్ణ తనయులు నందమూరి కళ్యాన్ రామ్, ఎన్టీఆర్ లు ఇద్దరు హీరోలుగా రాణిస్తున్న విషయం తెలిసిందే. అయితే కళ్యాన్ రామ్ మాత్రం కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు.  ఈ ఏడాది సంక్రాంతి కి కానుగా ఎంతమంచి వాడవురా సినిమాతో ప్రేక్షకుల ముందు కు వచ్చాడు.. కానీ ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది.  ప్రస్తుతం మంచి కథకోసం ఎదురు చూస్తున్న కళ్యాన్ రామ్ తాజాగా తన లుక్ మార్చుకున్నట్లు తెలుస్తుంది. ఈ మద్య స్టార్ హీరోలంతా కాస్త వెరైటీ లుక్ తో ప్రేక్షకులను ఆకర్షిస్తున్నారు.

 

ఎప్పుడు ఒకే లుక్ తో కనిపిస్తే బోర్ ఫీల్ అవుతారని అనుకుంటున్నారో ఏమో.. క్యారెక్టర్స్ కూడా అలాంటివే ఎంచుకుంటున్నారు. ఆ మద్య సుకుమార్ దర్శకత్వంలో ఎన్టీఆర్ న్యూ లుక్ తో అదరగొట్టాడు.  గత ఏడాది హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ పాత రౌడీ లుక్ తో బెదరగొట్టాడు.  ఈ నేపథ్యంలో కళ్యాన్ రామ్ కూడా ఈసారి కొత్త లుక్ తో ఎంట్రటైన్ చేయాలని ఫిక్స్ అయినట్టు ఉన్నాడు. తాజాగా కళ్యాణ్ రామ్ అపోలో లైఫ్ స్టూడియో జిమ్ దగ్గర కెమెరాకు చిక్కాడు. అక్కడ వర్క్ అవుట్స్ పూర్తి  చేసుకొని బయటకు వస్తున్న సమయంలోకెమెరాకు చిక్కారు. 

 

సహజంగా ఏదైనా కొత్త గెట్ అప్ లోకి మారాల్సినప్పుడు హీరోలు ఇలా ఎక్కువగా జుట్టు పెంచుతారు. దీనితో  కళ్యా రామ్ తప్పకుండా ఈసారి అందరి చూపు తిప్పుకునేలాంటి లుక్ తో రాబోతున్నారా అని అనుకుంటున్నారు.  ఇప్పుడు మల్లిడి వేణు అనే కొత్త దర్శకుడితో రావణ్ అనే సోసియో ఫాంటసీ చిత్రం చేస్తున్నట్టు సమాచారం.  కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ మీద ఈ చిత్రం ప్లాన్ చేస్తున్నారు.  అయితే ఇప్పటి వరకు  ఈచిత్రంపై అఫిషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: