యాంక‌ర్ సుమ‌.. ఈ పేరు తెలియ‌ని వారుండ‌రు. టీవీ ఇండ‌స్ట్రీలో ఎంత మంది గొప్ప హోస్టులు, యాంక‌ర్స్ ఉన్నా అంద‌రికీ ఆదిగురువు మాత్రం సుమ క‌న‌కాలే. ఒక‌టి రెండు కాదు.. రెండు ద‌శాబ్దాలుగా టెలివిజ‌న్ రంగాన్ని మ‌కుటం లేని మ‌హారాణిగా ఏలేస్తుంది ఈ సుమ‌క్క‌. అలాగే క్షణం తీరిక లేకుండా ఫంక్షన్లు, ప్రోగ్రాంతో సుమ బిజీ బిజీగా ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. తరాలు మారుతున్నా.. సుమ మాత్రం మారడం లేదు. అలుపన్నదే లేకుండా తన వాగ్దాటితో అందర్నీ ఆకట్టుకుంటోంది.

 

సినిమా రంగంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ గానీ, సక్సెస్ మీట్ గానీ ఏదైనా జరిగితే సుమ లేకుండా నిర్వహించడం కష్టమే అంటారు. అంత‌లా ప్రేక్ష‌కుల మ‌న‌సుల్లోకి చొచ్చుకుపోయింది సుమ‌.  అయితే సుమ మొదట సీరియల్ ద్వారానే టెలివిజన్ తెరకు పరిచయం అయ్యారన్న సంగతి చాలా తక్కువ మందికి తెలిసు. ఈ విష‌యం ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే..  సుమ మరోసారి సీరియల్ రంగంలోకి రాబోతున్నారు కాబ‌ట్టి. ఇప్పటి వరకు బుల్లితెర‌పై అనేక షోలకు యాంకర్ గా చేసిన సుమక్క ఇప్పుడు స్టార్ మా ఛానెల్ ద్వారా ఓ సరికొత్త కామెడీ సీరియల్ తో అలరించనున్నారు.

 

అదే హౌస్ ఆఫ్ హంగామా. ఈ సీరియ‌ల్ ద్వారా కేవలం కామెడీతో మాత్రమే అలరించడానికి సిద్ధంగా ఉంది సుమ‌క్క‌. ఇక ఈ సరికొత్త ధారావాహికను వచ్చే మార్చ్ 16 సోమవారం నుంచి ప్రతీ సోమవారం - శుక్రవారం వరకు రాత్రి 9:30 గంటలకు ప్రసారం చేయ్యనున్నారు. దీంతో సుమ‌క్క ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. అలాగే ఈ ఫుల్ కామెడీ సీరియ‌ల్‌లో సుమ, రేడియో మిర్చి ఆర్ జె హేమంత్ లాంటి నటులతో ఎంటర్టైన్ చెయ్యడానికి మ‌రియు ప్రేక్ష‌కులు ఫుల్ కామెడీ అందించ‌డానికి రెడీగా ఉన్నారు. దీంతో బుల్లితెర ప్రేక్ష‌కులు సుమ‌క్క సీరియ‌ల్ కోసం అతృత‌గా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: