భారతదేశంలో ప్రతీ రంగం మీద సినిమా ప్రభావం ఉంటుంది. అందుకే సినిమాల్లో సూపర్‌ స్టార్‌గా వెలుగొందిన చాలా మంది రాజకీయాల్లోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. సౌత్ లో అయితే ఇలా వెండితెర మీద నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన వారు మరింత మందే ఉన్నారు. ఎన్టీఆర్‌, ఎమ్జీఆర్‌, జయలలిత, కరుణానిది లాంటి వారు ఏకంగా అధికార పీఠాన్ని కూడా కైవసం చేసుకున్నారు. అయితే ఇలా సక్సెస్‌ అయిన వాళ్లేకాదు వెండితెర మీద ఓ వెలుగు వెలిగి రాజకీయాల్లో మాత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయిన తారుల కూడా చాలా మందే ఉన్నారు.

 

ఈ లిస్ట్‌లో ముందుగా చెప్పుకోవాల్సిన హీరో మెగాస్టార్‌ చిరంజీవి. టాలీవుడ్‌ లో నెంబర్‌ వన్‌ హీరో ఎవరు అంటే ఏ మాత్రం తడుముకోకుండా చెప్పే పేరు మెగాస్టార్‌ చిరంజీవి. వెండితెర మీద తిరుగులేని స్టార్ ఇమేజ్‌ అందుకున్న మెగాస్టార్ కోట్లాది మంది అభిమానులకు ఆరాధ్య దైవంగా వెలుగొందాడు. అంతేకాదు రక్తదానం, నేత్రదానం లాంటి సేవా కార్యక్రమాలతో ఎంతో మంది ప్రాణదానం చేశాడు. దీంతో చిరు రాజకీయ అరంగేట్రం గురించి రెండు దశాబ్దాలకు పైగానే చర్చ జరిగింది. కానీ చిరు రాజకీయాల్లో వచ్చిన తరువాత మాత్రం సీన్‌ మారిపోయింది.

 

2009లో ఎంతో అట్టహాసంగా ప్రజారాజ్యం పార్టీని ప్రకటించి రాజకీయ అరంగేట్రం చేశాడు చిరు. అధికారం నాదే అంటే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన చిరు బొక్కబోర్లా పడ్డాడు. కేవల 18 ఎమ్మెల్యే సీట్లకు మాత్రమే పరిమితమయ్యాడు మెగాస్టార్‌. దీంతో ఇక రాజకీయాలు, సొంత పార్టీ తనకు సరిపడవనుకొని కాంగ్రెస్‌తో కలిసి పోయాడు. అయితే ఎన్నికల్లో ఫెయిల్ అయిన తరువాత చిరు అడుగులు జాగ్రత్తగానే వేశాడు. రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర మంత్రి పదవి కూడా చేపట్టాడు. ఓవరాల్‌గా చూసుకుంటే వెండితెర మీద మెగాస్టార్ అనిపించుకున్న చిరు, రాజకీయాల్లో మాత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: