చిన్న తెర మీద పాపులర్ అయినవాళ్ళు సిల్వర్ స్క్రీన్ మీద సక్సస్ అవరని అంటుంటారు. అందుకు చాలామంది నటులే ఉదాహరణ గా చెప్పొచ్చు. అయితే హీరోయిన్ గా సక్సస్ అవకపోయినప్పటికి మంచి క్యారెక్టర్స్ తో బాగా ఫేమస్ అయింది బుల్లి యాంకర్ అనసూయ. ఇక అందం అభినయం తో పాటు ఎక్స్‌ఫోజింగ్ కి ఘాటు లిప్ కిస్సులకి వెనకాడని రష్మీ కూడా స్టా హీరోయిన్ గా సెటిలవలేకపోయింది. ఇక రవి కూడా హీరోగా నటించి సక్సస్ కాలేక మళ్ళీ యాంకర్ గానే కొనసాగుతున్నాడు. మొన్నా మధ్య వచ్చిన సుడిగాలి సుధీర్ కూడా హీరోగా చేస్తే ఎవరూ ఎంకరేజ్ చేయలేదు.

 

ఇంతమంది ని ఎగ్జాంపుల్ గా చూస్తూ కూడా ప్రస్తుతం మేల్ యాంకర్ గా మంచి ఫాం లో ఉన్న ప్రదీప్ మాచి రాజు హీరోగా ట్రై చేస్తున్నాడు. అయితే ప్రదీప్ హీరో అంటే కానివ్వనే వాళ్ళ కంటే ఒళ్ళు కాల్చుకుంటావేమో అన్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అయినా ప్రదీప్ మాత్రం ఇవేవి లెక్క చేయకుండా చాలా ధీమాగా ఉన్నాడు. అందుకు కారణం కొన్ని సినిమాలలో ఇప్పటికే చిన్న చిన్న పాత్రల్లో కనిపించడం. అయితే ఆ పాత్రలేవి ప్రదీప్ ని గుర్తుపెట్టుకునేలా లేవన్న సంగతి తెలిసిందే.


 
ఇక ప్రదీప్ త్వరలో '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మున్నా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ 'నీలి నీలి ఆకాశం' ఇప్పటికే 50 మిలియన్ల వ్యూస్ దాటేసింది. ఈ సినిమాలోని మిగతా పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే కథ గొప్పగా లేదన్న టాక్ మాత్రం అప్పుడే వినిపిస్తుంది. మరి ప్రదీప్ ఆశలన్ని ఎంతవరకు నిలబడతాయో చూడాలి. ఇక ఈ సినిమాని గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేయబోతుండటం ఆసక్తికరమైన విషయం. అంతేకాదు ఈ విషయం ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: