తెలుగు సినిమా పరిశ్రమకు ఇప్పటివరకు వచ్చిన హీరోయిన్లలో కొందరు హీరోయిన్లు అలా వచ్చి కొన్ని సినిమాల్లో నటించి ఇలా వెళ్లిపోగా, మరికొందరు మాత్రం, తమ అందం అభినయంతో పలు సినిమాల్లో అద్భుతంగా నటించి మంచి పేరున్న నటీమణులు గా ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆ విధంగా నాటి సావిత్రి, జమున, అంజలీదేవి, కృష్ణకుమారి, షావుకారు జానకి, భానుమతి వంటి వారి నుండి నేటి రాశి ఖన్నా, సమంత, రకుల్ ప్రీత్ సింగ్, నయనతార, అనుష్క, రష్మిక, కాజల్, తమన్నా వంటి ఎందరో నటీమణులు ఉన్నారు. 

 

అయితే ప్రస్తుతం వీరిలో ఒక స్టార్ హీరోయిన్ గా మంచి హోదాలో గొప్ప పేరుతో కొనసాగుతున్న ఒక నటీమణీ, ఇటీవల ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో హీరోయిన్ గా ఒకసారి సినిమాల్లో రంగ ప్రవేశం చేయటం కొంత తేలికే. అయితే ఆ విధంగా వచ్చిన అవకాశాలను మన టాలెంట్ తో కనక నిలబెట్టుకో గలిగితే, తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుందని ఆమె చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం పాటు బాధలు కూడా ఉంటాయని, కానీ రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగితే సక్సెస్ తప్పక వరిస్తుందని ఆమె అన్నారు. ఇక తాను సినిమాల్లో ఎంత కష్టపడతానో, వ్యక్తిగత జీవితంలో తనకు నచ్చినట్టు వ్యవహరించడంలో అదేవిధంగా ఉంటానని ఆమె అన్నారు. 

 

అయితే ఆ ఇంటర్వ్యూ లో భాగంగా, మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన రెండు విషయాలైన తిండి, శృంగారంలో మీరు ఏది లేకుండా జీవించలేరు అని ప్రశ్నించగా, ఆ నటి శృంగారం అంటూ సమాధానం చెప్పగానే సదరు మీడియా పర్సన్ సహా ఆమె అభిమానులందరికీ కూడా ఒక్క సారిగా గుండె షాక్ అయింది. అయితే ప్రతి ఒక్కరికి వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయని, ఆమె అభిప్రాయం ప్రకారం ఆమె మాట్లాడిన దానిలో తప్పు పట్టాల్సింది ఏమీ లేదని, ఇప్పటికీ కూడా ఆమె అభిమానులు పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆమె వ్యాఖ్యలపై కామెంట్స్ చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: