ప్రస్తుతం 30 ఇయర్స్ పృథ్వీ కి సరదా తీరుతోంది. చక్కగా సినిమాలు చేస్తున్నంత కాలం 30 ఇయర్స్ పృథ్వీ మీద ఏ కాంట్రవర్సీలు లేవు. వరుసగా సినిమాలు చేస్తూ సంపాదనకి సంపాదన, పేరుకి పేరు సంపాదించుకున్నారు. అంతేకాదు తన డైలాగ్ విపరీతంగా పాపులర్ అయి అందరు అలానే పిలుస్తున్నారు. అయితే గత ఎన్నికల టైంలో వైసీపీలో చేరిన 30 ఇయర్స్ పృథ్వీ సినిమా వాళ్ళని నోటికొచ్చినట్టు మాట్లాడాడు. కడుపులో పేరుకుపోయిందంతా బయటికి తీసి అందరి మీద విరుచుకు పడ్డాడు. రాజకీయాల్లో చక్రం తిప్పుదామని కాళ్ళకి చక్రాలు కట్టుకొని తిరిగాడు.

 

అయితే ఆయన ప్లాన్స్ అన్ని బెడిసి కొట్టాయి. ఇప్పుడు మళ్ళీ సినిమా వాళ్ళ పంచన చేరాలని చూస్తున్నారు. రాజకీయనాయకుల చేతిలో బలైపోయిన 30 ఇయర్స్ పృథ్వీ రాజ్ ఇప్పడు రాజకీయాలను తిడుతూ సినిమా వాళ్ళని పొగుడుతున్నాడు. తిరుపతిలో ఎస్వీబిసి చైర్మన్‌గా ఉండి ఇక నా బతుకు అనుభవించు రాజా అన్నట్టే ఉంటుందనుకొని సినిమా వాళ్లని అడ్డమైన బూతులు తిట్టడం, జగన్ సీఎం అవడం ఇష్టం లేకనే సినిమా పెద్దలెవరూ జగన్‌ని కలవలేదంటూ.. సినిమా ప్రముఖులను తనదైన తరహాలో రెచ్చిపోయి ఎద్దేవా చేశాడు. అయితే ఇప్పుడు సీన్ సితారై నాకు సినిమాలే గతి అన్నట్టుగా ఎవరైనా ఛాన్సులివ్వండి అంటూ బ్రతిమాలుతున్నాడు.

 

ఎస్వీబిసి చైర్మన్ గా తీవ్ర ఆరోపణలు ఎదుర్కుంటున్న పృథ్వీ ఆ పదవికి రాజీనామా చేసాక యూట్యూబ్ ఛానల్ వాళ్ళ దగ్గర ఇంటర్యూస్ కి వెళ్లి బోరుమంటున్నాడు. ఇప్పటికీ రాజకీయాల వల్ల తాను బలైపోయా అని.. సొంత పార్టీ నాయకులే తనని బలి చేసారని.. సుబ్బారెడ్డి కోరడంతోనే తాను రాజీనామా లేఖను సమర్పించినట్టు.. జగన్ తనని రాజీనామా చెయ్యమని చెప్పలేదని.. అని వాపోతున్నాడు. తనని ఈ ఎపిసోడ్‌లో చెప్పుతో కొట్టినట్టుగా బయటకి పంపేశారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నాడు.  ఇక ప్రస్తుతం తనకి తన కుటుంబానికి చిరంజీవే దిక్కు అంటూ అవకాశలిమ్మని నాకు బుద్దొచ్చిందన్నట్టుగా బ్రతిమాలుతున్నాడు. అయితే పృథ్వీ అమ్మాయితో అసభ్యంగా మాట్లాడిన అడ్డంగా బుక్కైన సంగతి తెలిసిందే. దాని వల్లే ఈ నోటి దూల రాయుడి పరిస్థితి తలకిందులైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: