ప్రముఖ నటుడు కమల్ హాసన్ పెద్ద కూతురు అయిన శృతిహాసన్ చిన్నప్పటి నుండి తండ్రి నటించిన పలు సినిమాల్లో అక్కడక్కడా చిన్న పాత్రల్లో మెరిసింది. ఆ తర్వాత డాన్స్, సంగీతం, నటన వంటి పలు కళల్లో మంచి శిక్షణ తీసుకున్న శృతిహాసన్, ఆపై హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించారు. తెలుగులో సిద్ధార్థ హీరోగా వచ్చిన అనగనగా ఒక ధీరుడు ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన శృతిహాసన్, ఆ తర్వాత పలువురు స్టార్ హీరోల సరసన పలు విజయవంతమైన సినిమాల్లో నటించి మంచి పేరు గడించారు. అలానే అటు తమిళంలో కూడా ఆమె పలు సినిమాల్లో నటించి హీరోయిన్ గా మంచి ఇమేజ్ ని సంపాదించుకున్నారు. ఇక తండ్రి కమల్ హాసన్ వలె తన వ్యక్తిగత జీవితానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే అలవాటు ఉన్న శృతిహాసన్, ఇది మనకు దేవుడు ఇచ్చిన ఒకే ఒక్క జీవితం అని, దీనిని మనకు నచ్చినట్లు జీవించే హక్కు మన అందరికీ ఉందని అంటూ ఉంటారు. 

 

ఇకపోతే కొద్దిరోజుల క్రితం ఒక మీడియా ఛానల్ కు ముంబైలోని తన ఇంటిని గురించి, అలానే వ్యక్తిగత వివరాల గురించి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో శృతిహాసన్ మాట్లాడుతూ, మిగతా ప్రజల వలే మేము కూడా సాధారణ మనుషులమే. మాకంటూ కొన్ని ప్రత్యేకమైన ఇష్టాలు, కోరికలు ఉంటాయి అవి అందరూ అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా నా మటుకు నేను అప్పుడప్పుడు కొన్ని పార్టీలు, ఫంక్షన్లలో మందు తాగుతూ ఉంటాను. అయితే మన దేశంలో మాత్రం ఆడవాళ్లు మందు తాగటం అంటే అదేదో ఒక వింత విషయంగా అందరూ భావిస్తూ ఉంటారు. ఏం, మందు ఆడవాళ్ళు తాగకూడదా మగవారు మాత్రమే తాగాలి అని ఎక్కడైనా రాసుందా, నేను మందు తాగడం అంటే విచ్చలవిడిగా తాగను, ఎప్పుడో అప్పుడప్పుడు పార్టీలు వచ్చినప్పుడు, అది కూడా పరిధి మేరకు చాలా తక్కువ మోతాదులో మాత్రమే తీసుకుంటాను. 

 

అయినా అందులో పెద్ద తప్పేముంది చెప్పండి, అదేదో పెద్ద ఘోరమైనట్టు కొందరు విచిత్రంగా భావిస్తూ ఉంటారు నా మటుకు నాకు అయితే అది కరెక్ట్ అనిపిస్తుందని ఆమె అన్నారు. అలానే నా కోసం వేరొకరిని మందు అలవాటు చేసుకోమని నేను చెప్పను, అలాగని వేరొకరి కోసం నా అలవాట్లను నేను మార్చుకోలేను అంటూ శృతి వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పు పడుతూ ఉంటే, మరికొందరు మాత్రం ఎవరి వ్యక్తిగత జీవితాలు వారికి ఉంటాయని, హీరోయిన్ గా గొప్ప పేరును సంపాదించి ముందుకు సాగుతున్న శృతికి తన జీవితాన్ని తనకు నచ్చినట్లు జీవించే హక్కు ఉందని పలువురు నెటిజన్లు తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అభిప్రాయపడుతున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: