దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా 'ఆర్.ఆర్.ఆర్. ఈ సినిమా లో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలు గా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ అలియా భట్ హీరోయిన్ గా.. అజయ్ దేవగణ్ ముఖ్య పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమా మీద హిందీ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక దేశవ్యాప్తం గా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాకి సంబంధిన లేటెస్ట్ అప్‌డేట్ ఒకటి బయటకి వచ్చింది. అదేమిటంటే ఈ ఉగాది పండుగ సందర్భంగా ఆర్.ఆర్.ఆర్ టైటిల్ ని రివీల్ చేయనున్నారట రాజమౌళి బృందం.

 

ఇప్పటి వరకు ఆర్.ఆర్.ఆర్ అనేది ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్ అని మాత్రమే యూనిట్ చెప్పుకుంటు వచ్చారు. అందుకే ఈ అక్షరాలకి ఫుల్ ఫామ్ గా రెండు పేర్లు పరిశీలిస్తున్నారట రాజమౌళి. అందులో ఒకటి 'రఘుపతి రాఘవ రాజారాం' అయితే రెండవది 'రామ రావణ రాజ్యం' అని తాజా సమాచారం. ఈ రెండిటిలో ఒక టైటిల్ ను ఫైనలైజ్ చేసి ఉగాది పండగ సందర్భంగా అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి 'బాహుబలి' సినిమాతో కంపేరిజన్ మొదలైంది.

 

సినిమా స్థాయిలో 'ఆర్.ఆర్.ఆర్ కలెక్షన్స్ రాబట్టగలుగుతుందా అనే విషయంపై కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 'బాహుబలి' మొదటి భాగం సమయంలో 'భారతదేశంలో అత్యధిక బడ్జెట్ తో నిర్మించిన సినిమా' అన్న స్ట్రాటజీని బాగా ఉపయోగించారు. ఇక రెండవ భాగం వచ్చేసరికి 'వై కట్టప్ప కిల్డ్ బాహుబలి?' అనే ప్రశ్న భారీ హైప్ తీసుకొచ్చింది. కాని 'ఆర్.ఆర్.ఆర్ విషయంలో ఇలాంటి క్రేజ్ ఇప్పటివరకూ కనిపించలేదు.

 

అంతేకాదు రాజమౌళి టీమ్ 'బాహుబలి' సినిమాకి ఉపయోగించిన మార్కెటింగ్ టెక్నిక్స్ ఆర్.ఆర్.ఆర్ కోసం వాడడం లేదనే భిన్న అభిప్రాయాలు కూడా చాలామందిలో ఉన్నాయి. అదీకాక థియేట్రికల్ రైట్స్ కూడా బాహుబలి కంటే ఎక్కువగా చెప్పడం తో రికవరీ ఉంటుందా అని బయ్యర్లు కాస్త ఆందోళనగానే ఉన్నారట. ఇవన్ని ఒక ఎత్తైతే సంక్రాంతికి రిలీజ్ చేయడం కూడా పెద్ద రిస్క్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి జక్కన్న ప్లాన్స్ ఏంటో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: