విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు అనే పేరు ఈ విశ్వంలో తెలుగు వాడు బతికున్నంత వరకు నిలిచి ఉంటుంది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. కేవలం సినిమాల్లోనే కాక అటు రాజకీయాల్లో కూడా ఎంతో గొప్ప పేరు సంపాదించిన ఎన్టీఆర్ ఎప్పటికీ మన ప్రేక్షకుల మనసులో నిలిచి ఉంటారు. ఆయన మనవడు గా నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు నందమూరి టైగర్ ఎన్టీఆర్. ఇక ఆ తర్వాత నుండి వరుసగా సినిమాలు చేస్తూ తన టాలెంట్ తో ఎన్నో విజయాలు అందుకుని ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు ఎన్టీఆర్. ఆ తర్వాత కొన్నేళ్ళ క్రితం నార్నె శ్రీనివాసరావు తనయ లక్ష్మీప్రణతి వివాహం చేసుకున్న ఎన్టీఆర్, ప్రస్తుతం ఇద్దరు సంతానంతో హ్యాపీ గా తన ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ మరోవైపు సినిమాలు చేసుకుంటూ ఆనందంగా ముందుకు సాగుతున్నారు. 

 

ఇక ప్రస్తుతం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే భారీ ప్రతిష్టాత్మక సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్, ఆ సినిమా ద్వారా తొలిసారిగా కొణిదెల స్టార్ హీరో రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఇక ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ తో తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అందుబాటులో ఉండే ఎన్టీఆర్, నేడు హోలీ పండుగ సందర్భంగా తన భార్య ప్రణతి సహా ఇద్దరు కుమారులైన అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో కలిసి దిగిన ఫోటో ని షేర్ చేశారు. ఎన్టీఆర్ షేర్ చేసిన ఆ ఫోటో ఉదయం నుండి పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే ఆ ఫోటోలో ఎన్టీఆర్ చిన్న తనయుడైన భార్గవ్ రామ్ అందరి దృష్టినీ విశేషంగా ఆకర్షిస్తున్నాడు. 

 

చిన్న వయసులోనే ఎంతో గొప్ప తేజస్సు గల భార్గవ్ రామ్, తప్పకుండా పెరిగి పెద్దయ్యాక తాత ఎన్టీఆర్ గారి మాదిరిగా ఎంతో గొప్ప స్థాయికి ఎదుగుతాడు అని పలువురు ప్రేక్షకులతో పాటు సినిమా ప్రముఖులు సైతం అతడి ముఖ వర్చస్సు చూసి పొగుడుతున్నారు. ఇక మరి కొందరయితే, కోహినూర్ వజ్రం వంటి నీ ముఖ తేజస్సు చూస్తుంటే బహుశా అన్న రామారావు గారే మళ్లీ పుట్టారా అని అనిపిస్తుంది బిడ్డా అంటూ తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కొందరు నందమూరి ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: