టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముందుగా బాలనటుడిగా పలు సినిమాల్లో నటించి అప్పట్లోనే ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని పెరిగి పెద్దయిన తర్వాత రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు మహేష్. 1999లో వైజయంతి మూవీస్ బ్యానర్ పై దిగ్గజ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో మహేష్ సరసన ప్రీతిజింతా హీరోయిన్ గా తెరకెక్కిన ఆ సినిమా అప్పట్లో అది పెద్ద ప్రభంజనాన్ని సృష్టించింది. తొలి సినిమాతోనే ప్రిన్స్ గా తెలుగు ప్రజల పాలిటి రాజకుమారుడు గా మహేష్ బాబు ప్రేక్షకుల్లో మంచి స్థానాన్ని సంపాదించుకున్నారు. పలు ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, ఎంటర్టైన్మెంట్, అలరించే మ్యూజిక్, ఆకట్టుకునే బ్యాక్ గ్రౌండ్ తదితర అంశాలతో దర్శకుడు రాఘవేంద్ర రావు ఆ సినిమాని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. 

 

ఇక ఆ సినిమాలోని పాటలు ఎంత గొప్ప విజయాన్ని అందుకున్నాయి అంటే, ఇప్పటికీ కూడా ఆ పాటలు ఎక్కడో ఒక చోట వినబడుతూనే ఉంటాయి. ఇకపోతే ఆ సినిమాలో ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం హాస్యం పండించిన సన్నివేశాలు ఎంతో అద్భుతంగా ఉండడంతో పాటు, థియేటర్స్ లో ప్రేక్షకులను విపరీతంగా గిలిగింతలు పెట్టాయి. మరీ ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో ముంబై నటుడు అస్రానీ తో కలిసి బ్రహ్మానందం పండించిన హాస్య సన్నివేశాలు ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు తలచుకుంటూనే ఉంటారు. అందులో ముఖ్యంగా బ్రహ్మానందం హోటల్ కి వెళ్లి భోజనం చేసే సమయంలో మటన్ బోన్ ని చప్పరిస్తూ నటించే సీన్ ఎంతో హాస్యభరితంగా ఉంటుంది. అయితే ఆ సీన్ కు ముందుగా బ్రహ్మానందంతో పాటు మరొక పోలీస్ ఆఫీసర్ అయిన అస్రానీ ఇద్దరూ ఒక పెద్ద రేపిస్ట్ కోసం వెతుకుతూ ఉంటారు. 

 

అయితే ఆ రేపిస్ట్ ఫోటో బ్రహ్మానందం దగ్గర ఉంటుంది, కానీ దానిని తన అస్రానీ కి చూపించకుండా దాచి పెడుతూ ఉంటాడు. అదే సమయంలో భోజనం చేయటానికి వారిద్దరూ ఒక హోటల్ కి వెళ్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత, భోజనానికి కూర్చునే ముందు, అస్రానీ ఫోటో చూపించండి సార్ అని అడుగగా, దానికి బ్రహ్మానందం బదులిస్తూ, ఫోటో లేదు గీటో లేదు, పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ముక్కు కొరికేస్తా, కమాన్ హ్యావ్ ఇట్, వెళ్ళు వెళ్ళు అంటూ ఆయన పలికే డైలాగ్ థియేటర్ ప్రేక్షకుల్లో నవ్వులు పూయిస్తుంది. ఆ విధంగా అప్పట్లో పెద్ద విజయాన్ని అందుకున్న ఆ సినిమా ని మహేష్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం ఎప్పటికీ మరిచిపోలేరు అనే చెప్పాలి....!!

మరింత సమాచారం తెలుసుకోండి: