టాలీవుడ్ లో చూడముచ్చటైన జంట జీవితా రాజశేఖర్. అయితే.. వీరు రాజకీయాల్లో ఇన్వాల్వ్ కాకుండా గతంలో జీవిత, రాజశేఖర్‌ లు టీడీపీ సానుభూతి పరులుగా ఉండేవారు. కాగా., వీరు ఆ తర్వాత 2009లో కాంగ్రెస్‌ లో చేరారు. వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన వైసీపీలో చేరారు. ఆ తర్వాత వైసీపీకి గుడ్‌ బై చెప్పారు అనంతరం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు వీరిద్దరు. మళ్లీ సార్వత్రిక ఎన్నికల నేపద్యం మళ్లీ వైసీపీలో చేరారు.

 

 

 అయితే.. ఇద్దరు మళ్లీ వైసీపీలో చేరారు. ఆ తర్వాత రాజశేఖర్‌ చాలా రోజుల తర్వాత జగన్‌ ను కలిశానని, మా మధ్య ఉన్న కొన్ని మనస్పర్థలు ఈ రోజుతో తొలగిపోయాయన్నారు. అప్పట్లో నేను అపరిపక్వతతో  ప్రవర్తించాను. నాకు శత్రుత్వం లేదు, కానీ ఎందుకో మనస్పర్థలు ఉన్నాయి. అవి తొలగించుకోవడానికే ఆయన దగ్గరకు వచ్చానని అన్నారు. అప్పటి జగన్‌ ఇప్పటి జగన్‌ వేరు. యువకుడైన వైఎస్‌ జగన్‌ కు ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలి. ఆయన ముఖ్యమంత్రి అయ్యేందుకు మా వంతు కృషి చేస్తాం అని అన్నారు. హైదరాబాద్‌ లోని లోటస్ పాండ్‌ లో పార్టీ అధ్యక్షుడు జగన్‌ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే జగన్ ను కలవడం ఆలస్యం అయిందని వారు బాధపడ్డారు.

 

 

జీవితా రాజశేఖర్.. ఏపీ ప్రజలకిచ్చిన మాట జగన్ నిలబెట్టుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. తాము ప్రచారం చేసిన ప్రాంతాల్లో వైకాపా అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలిచారని హర్షం వ్యక్తం చేశారు.   వైసీపీ గెలుపులో తాము భాగస్వాములు కావడం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. దిల్లీలో మోదీని, రాష్ట్రంలో జగన్‌ ను గెలిపించి ప్రజలు మంచి నిర్ణయం తీసుకున్నారని జీవితా రాజశేఖర్ వ్యాఖ్యానించారు. అలాగే.. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఓడిపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేసిన జీవిత రాజశేఖర్.. భీమవరంలో పవన్ గెలిస్తే బాగుండేదని వారు అభిప్రాయపడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: