ఆంధ్రుల ఆడపడుచు తెలుగు జాతి గర్వించదగ్గ సినీనటి ఊర్వశిగా తన పేరును లిఖించుకున్న శారద గురించి ఆనాటి తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నాలుగు దశాబ్దాలుగా తెలుగు వెండితెరపై ఎన్నో పాత్రల్లో నటించిన శారదకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. శారద నటన అంటే కేవలం తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే కాదు తమిళం, కన్నడం, మలయాళం ఇలా అన్ని భాషలకు చెందిన ప్రేక్షకులు ఎంతో మ‌క్కువ‌తో చూస్తారు. శారద అప్పట్లో మలయాళంలో పెద్ద సూపర్‌స్టార్ అయిపోయారు. అంటే ఆమెకు అక్కడ ఏ స్థాయిలో గుర్తింపు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. 1980- 90 వ దశకంలో సౌత్ ఇండియాలో ఉన్న అందరు హీరోలతో నటించిన శారద ఆ తర్వాత అమ్మగా అత్తగా నటించి తన పాత్రలకు జీవం పోశారు.

 

 1996లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన శారద ఈ రంగంలో మాత్రం అయ్యారు. వెండి తెరపై దశాబ్దాలపాటు తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్న శారదను చంద్రబాబు తన రాజకీయ వ్యూహంలో బలిపశువును చేశారని చెప్పాలి. 1996 లోక్‌స‌భ‌ ఎన్నికల్లో చంద్రబాబు గుంటూరు జిల్లాలోని తెనాలి ఎంపీ సీటు కేటాయించారు. ఎన్నికల్లో ఆమె విజయం సాధించిన ఆ తర్వాత రెండేళ్లకు 1998లో మళ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో శారద అప్పటి కాంగ్రెస్ దిగ్గజం శివశంకర్ చేతిలో ఓడిపోయారు.

 

ఇక 1999 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఆమెను నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దించారు. ఎన్నికల్లో శారద దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజకీయ యోధుడు అయిన జనార్దన్ రెడ్డి సతీమణి రాజ్యలక్ష్మి పై పోటీ చేసి పది వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. వెంకటగిరి నియోజకవర్గం పూర్తిగా కొత్త అయితే చంద్రబాబు ఆదేశాల మేరకు అక్కడ ఇష్టంగానే పోటీ చేసిన శారద ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. ఏదేమైనా చంద్రబాబు రాంగ్ గైడెన్స్ తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన శారద రాజ‌కీయ జీవితం అట్ట‌ర్ ఫ్లాప్ అయింద‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: