తెలుగు సినిమా రంగంలో ఘట్టమనేని ఫ్యామిలీ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సూపర్ స్టార్ కృష్ణ తో ప్రారంభమైన ఫ్యామిలీ ఐదు దశాబ్దాలు దాటినా ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం కృష్ణ సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ స్టార్ హీరోల‌లో ఒకడిగా వెలుగొందుతున్నాడు. ఇదిలా ఉంటే కృష్ణ ఫ్యామిలీ సినిమా రంగంలో ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసింది. కృష్ణ, రమేష్ బాబు, మహేష్ బాబు హీరోలుగా నటించారు. ఇక కృష్ణ రెండో భార్య విజయనిర్మల ఒక తెలుగు మహిళగా ఉండే ఎన్నో విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ రికార్డు ఎక్కారు విజయనిర్మల నరేష్ సైతం హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణిస్తున్నారు.

 

అయితే కృష్ణ ఫ్యామిలీ కి రాజకీయాల్లో మాత్రం కలిసి రాలేదనే చెప్పాలి. ఎన్టీఆర్ పై కోపంతో ఈనాడు కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరారని ప్రచారం ఉంది. ఏలూరు ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకసారి విజయం సాధించిన కృష్ణ ఆ తర్వాత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయే రాజకీయాలకు దూరమైపోయారు. అలా వెండితెరపై సూపర్‌స్టార్‌గా ఒక వెలుగు వెలిగిన ఈ ప్రశ్నకు రాజకీయం ఎంత మాత్రం కలిసి రాలేదు. ఎక్కడ కృష్ణ రెండో భార్య విజయనిర్మల 1999లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు.

 

చంద్రబాబు ఆ ఎన్నికల్లో తటస్థ కోటాలో విజయనిర్మల కృష్ణా జిల్లాలోని కైకలూరు నుంచి పోటీ చేయించారు. ఎన్నికల్లో విజయనిర్మల ఇండిపెండెంట్ అభ్యర్థి చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత మళ్లీ ఆమె రాజకీయాల వైపు చూడలేదు. విజయనిర్మల కుమారుడు నరేష్ అనంతపురం జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ బీజేపీలోకి జంప్ చేశారు. బిజెపి నుంచి హిందూపురం ఎంపీ గా పోటీ చేసిన నరేష్ కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోలేక పోయారు. ఆ తర్వాత నరేష్ రాజకీయాలకు పూర్తిగా దూరంగా జరిగారు. ఏదేమైనా కృష్ణ ఫ్యామిలీ లో ఈ ముగ్గురు ఓడిపోవడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: