మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ హిట్ తర్వాత చేస్తున్న సినిమా సెట్స్ మీద ఉంది. కిరణ్ కొర్రపాటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ తో వస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో విలన్ గా కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటిస్తున్నాడని తెలుస్తుంది. కన్నడలో స్టార్ హీరో అయిన ఉపేంద్ర తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఆయన చేసిన సినిమాలు ఇక్కడ డబ్ అయ్యేవి. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్ర నటించారు. ఆ సినిమాలో ఆయన చేసిన పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

 

ఇక ఇప్పుడు వరుణ్ తేజ్ సినిమా కోసం మరోసారి ఉపేంద్ర పనిచేయనున్నారు. తన మార్క్ సినిమాలతో ఎంటర్టైన్ చేస్తున్న వరుణ్ తేజ్ ఈ సినిమాతో కూడా తన సత్తా చాటాలని చూస్తున్నాడు. సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపిస్తాడని తెలిసిందే. దీనికోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుని మరి వచ్చాడు. సినిమాకు టైటిల్ గా కూడా బాక్సర్ అని పెట్టే ఆలోచనలో ఉన్నారు. కిరణ్ కొర్రపాటి కొత్త దర్శకుడే అయినా సినిమా కథ బాగా రాసుకున్నాడట. ప్రస్తుతం మంచి ఫాం లో ఉన్న వరుణ్ తేజ్ ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.

 

వరుణ్ తేజ్ సినిమాల ప్లానింగ్ చాలా బాగుంది. కథల విషయంలో అతను చాలా క్లావార్ గా ఆలోచిస్తున్నాడు. ఎలాంటి కథలు సెలెక్ట్ చేసుకుంటే ఆడియెన్స్ తనని రిసీవ్ చేసుకుంటారో క్లియర్ గా ఒక ఆలోచనతో ఉన్నాడు. మెగా హీరోగా హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా ఏదో ఒక సినిమా చేశాం అన్నట్టు కాకుండా కొత్తగా ప్రయత్నిస్తూ కెరియర్ లో దూసుకేల్తున్నాడు వరుణ్ తేజ్. మరి కుర్రాడి స్పీడ్ చూస్తుంటే మెగా హీరోల్లో రాం చరణ్, అల్లు అర్జున్ తర్వాత ఆ రేంజ్ కు వెళ్ళేలా ఉన్నాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: