విజయ శాంతి... సినిమాల్లో సూపర్ స్టార్ గా ఎలా ఎదిగారో... రాజకీయాల్లో కూడా అతి తక్కువ కాలంలో అదే స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా తెలుగు చిత్ర సీమలో ఒక వెలుగు వెలిగారు విజయశాంతి. 90 లలో ఆమె హీరోలతో సమానంగా పారితోషికం డిమాండ్ చేసే వారు. ఆ తర్వాత ఆమె ప్రభ కాస్త సినిమాల్లో తగ్గుతూ వచ్చింది. ఆ తర్వాత ఆమె రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 1998 లో ఆమె బిజెపి ద్వారా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఆ పార్టీలో ఆమెకు పదవి వచ్చింది. 

 

అతి తక్కువ కాలంలోనే విజయశాంతికి గుర్తింపు దక్కింది ఆ పార్టీలో. అక్కడ మహిళా మోర్చా కార్యదర్శిగా నియమించింది బిజెపి అధిష్టానం. అయితే ఆ తర్వాత తెలంగాణా మీద ప్రేమతో ఆమె బిజెపిని వీడి తెరాస లోకి అడుగు పెట్టారు. తెరాస లో కూడా ఆమెకు తక్కువ కాలంలోనే గుర్తింపు వచ్చింది. అక్కడ కెసిఆర్ వద్ద ఆమెకు ప్రాధాన్యత లభించేది. పార్టీలో సీనియర్లు ఉన్నా సరే విజయశాంతి ని ఆయన గుర్తించారు. ఇక ఆ తర్వాత విజయశాంతి... మెదక్ నుంచి ఎంపీ గా కూడా వెళ్ళారు. 2014 ఎన్నికలకు ముందు తెరాస లో విభేదాలు వచ్చాయి. 

 

కెసిఆర్ తో భేదాభిప్రాయాలు రావడంతో ఆమె ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లోకి వెళ్ళారు. అక్కడ కూడా ఆమెకు గుర్తింపు లభించింది. 2018 ఎన్నికల్లో ఆమెను స్టార్ ప్రచారకర్త గా కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. ఏమైందో ఏమో తెలియదు గాని ఆమె ప్రత్యక్ష ఎన్నికల పోటీ కి దూరంగా ఉంటున్నారు. తమిళనాడు ప్రతిపక్ష పార్టీ డిఎంకె లో ఆమె చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఆమెకు మంచి ప్రాధాన్యత ఉంది. మరి ఎం చేస్తారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: