ఆర్కే రోజా... బహుశా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద కనీస అవగాహన ఉన్నా సరే ఈమె గురించి తెలియని వారు ఉండరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అయినా ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్ లో అయినా సరే ఆమె కు ఒక గుర్తింపు ఉంది. రాజకీయాల్లో ఆమె తక్కువ కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన రోజా ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. అక్కడ తెలుగు మహిళా అధ్యక్షురాలి గా చంద్రబాబు ఆమెను నియమించారు. 2009 ఎన్నికలకు ముందు ఆమె పార్టీ వాణిని బలంగా వినిపించారు. 

 

రెండు సార్లు ఆమె పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009 ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో రోజా తెలుగుదేశం పార్టీని వీడి అప్పుడు వైఎస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వైఎస్ మరణం తర్వాత ఆమె జగన్ పార్టీలో జాయిన్ అయ్యారు. పార్టీ పెట్టిన పదేళ్ళ కాలంలో ఆమె తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని ఆ పార్టీలో సంపాదించుకున్నారు అనేది వాస్తవం. ఎంత మంది నేతలు ఉన్నా సరే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆమెకు అంటూ ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు. పార్టీలో తిరుగులేని నాయకురాలిగా ఉన్నారు. 

 

ముఖ్యంగా విపక్షాల మీద, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేతల మీద ఆమె చేసే విమర్శలు కాస్త వివాదాస్పదంగా కూడా ఉంటాయి. వివాదాస్పద నాయకురాలిగా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల తర్వాత ఆమెకు మంత్రి పదవి వస్తుందని భావించారు. అయితే జగన్ కేబినేట్ హోదా తో కార్పోరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. అయినా సరే ఆమె ఎక్కడా నిరుత్సాహ పడకుండా రాజకీయాల్లో రాణిస్తున్నారు. గత ఏడాది ఎన్నికల్లో నగిరి నుంచి ఆమె రెండో సారి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: