సాధారణంగా ఒక టాప్ హీరో కోసం వ్రాసిన కథ మరొక టాప్ హీరో వద్దకు వెళ్ళి ఆ కథ మూవీగా వచ్చిన సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు చిరంజీవి కొరటాల ‘ఆచార్య’ కథ కూడా వాస్తవానికి చిరంజీవిని దృష్టిలో పెట్టుకుని కొరటాల వ్రాసిన కథ కాదు అన్న మాటలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ‘అజ్ఞాతవాసి’ విడుదలకు ముందు కొరటాల శివ పవన్ కళ్యాణ్ ను కలిసి తాను పవన్ ను దృష్టిలో పెట్టుకుని వ్రాసిన ‘ఆచార్య’ కథను వినిపించినట్లు టాక్. 

 

వాస్తవానికి ఈ కథలో పవన్ ద్విపాత్రభినయం చేసే విధంగా మొదట్లో కొరటాల కథను క్రియేట్ చేసి చాల పవర్ ఫుల్ గా దేవాలయ భూముల అన్యాక్రాంతం ప్రముఖ దేవాలయాలలో జరుగుతున్న అవినీతి ని హైలెట్ చేసే విధంగా కొరటాల తన సామాజిక స్పృహ తో పవన్ కోసం ఈ కథను వ్రాసినట్లు తెలుస్తోంది. ఈ కథను కొరటాల ద్వారా పూర్తిగా విన్న పవన్ తనకు ఈ కథ బాగా నచ్చిందని అయితే ‘అజ్ఞాతవాసి’ తరువాత తాను పూర్తిగా ప్రత్యక్ష రాజకీయాలలోకి వెళ్ళిపోతున్న పరిస్థితులలో తాను మళ్ళీ సినిమాలలో ఎప్పుడు నటిస్తానో తెలియదు కాబట్టి ఈ కథను చిరంజీవితో తీయమని కొరటాలకు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. 

 

అంతేకాదు చిరంజీవి దృష్టికి కథను పవన్ తీసుకువచ్చి ఈ కథలో మరొక ఆలోచన లేకుండా నటించమని ఈ మూవీని చరణ్ నిర్మాతగా నిర్మించమని గట్టిగా పవన్ రికమండ్ చేసినట్లు టాక్. ఆ తరువాత చిరంజీవి కొరటాల ను పిలిపించుకుని ఆ కథను విని వెంటనే ఓకె చెప్పి ఈ మూవీలో వచ్చే యంగ్ పాత్రను తాను కాకుండా చరణ్ చేత చేయిద్దామని చెప్పడంతో ‘ఆచార్య’ మూవీలో చరణ్ పాత్ర క్రియేట్ కాబడిందని తెలుస్తోంది. 

 

అయితే ఈ మూవీ షూటింగ్ ప్రారంభించాక అనుకోని విధంగా ‘ఆర్ ఆర్ ఆర్’ వచ్చే ఏడాదికి వాయిదా పడటంతో రాజమౌళికి ఇచ్చిన మాట రీత్యా చరణ్ కు ఈ మూవీలో నటించలేని పరిస్థితి ఏర్పడింది. దీనితో ఈ మూవీ వేగంగా పూర్తి చేద్దామని అనుకుంటే చరణ్ ప్రస్తుతం అందుబాటులో లేని పరిస్థితి పోనీ మహేష్ తో కలిపి తీద్దాము అనుకుంటే పెరిగిపోతున్న బడ్జెట్ సమస్యలు ఇలా అడుగడుగునా సమస్యలతో ‘ఆచార్య’ పరిస్థితి ప్రస్తుతం అయోమయంగా ఉంది. దీనితో పవన్ చిరంజీవికి చేసిన రికమండేషన్ కొరటాల కు మేలు చేసిందా లేక శాపంగా మారిందా అంటూ ఇప్పుడు కొందరు ‘ఆచార్య’ అయోమయం పై కొందరు కామెంట్స్ చేస్తున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: