రావు గోపాల రావు... తెలుగు సినిమా మీద కనీస అవగాహన ఉన్న వారికి కచ్చితంగా తెలిసిన పేరు ఇది. తన డైలాగులతో తన హాస్యంతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు ఆయన. అగ్ర హీరోల సినిమాలలో ఆయన విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. సినిమాల్లో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నారు ఆయన. దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో ఆయన ప్రస్తానం కొనసాగింది. అగ్ర హీరోలతో ఆయన చేసిన సినిమాలు అన్నీ దాదాపుగా విజయం సాధించాయి. సినిమాలో ఆయన ఉంటే చాలు కచ్చితంగా విజయం సాధిస్తుంది అనే నమ్మకం ఉంటుంది. 

 

ఆ విధంగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానం తో ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు అప్పట్లో. ఆ తర్వాత ఆయన్ను ఎన్టీఆర్... 1984 లో ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి ఎంపిక చేసారు. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి ఆయన ఎన్నికల్లో ప్రచారం చేయడం ఎన్టీఆర్ కి చేదోడు వాదోడుగా ఆయన ఉండే వారు. ప్రచారంలో ఆయన మాట్లాడే మాటలకు ప్రజల్లో మంచి గుర్తింపు ఉండేది. 

 

ఇక ఆ తర్వాత ఆయన్ను 86 లో ఎన్టీఆర్ రాజ్యసభకు పంపగా... 1989 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి విస్తృతంగా ప్రచారం చేసారు. ఆ ఏడాది పార్టీ అధికారం కోల్పోయింది. 1992 వరకు రాజ్యసభ సభ్యుడుగా ఉన్నారు. పలు బహిరంగ సభల్లో ఆయన ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగాలకు మంచి ఆదరణ వచ్చేది అప్పట్లో. 1994 లో 57 ఏళ్ళ వయసులో ఆయన అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయారు. సినిమాల్లో అయినా రాజకీయాల్లో అయినా సరే ఆయనది ప్రత్యేక శైలి. ఇప్పుడు ఆయన తనయుడు రావు రమేష్ సినిమాల్లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: