పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సినిమాల్లో ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ... వాటన్నింటినీ వదులుకొని జనసేవ చేయాలనే లక్ష్యంతో... ప్రస్తుత రాజకీయ పరిస్థితులను మార్చి నిజాయితీగల రాజకీయాలను ప్రజలకు చూపించాలి అనే ఎజెండాతో... జనం కోసం జనసేన పార్టీని స్థాపించి జనాల్లోకి వెళ్లి జనసేన చేయాలని భావించారు పవన్ కళ్యాణ్. అధికారం దక్కక పోయినా పర్లేదు అన్యాయంపై ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాను అనే ధ్యేయంతో ముందుకు సాగుతూనే ఉన్నారు. ఇక మొదట 2014 లో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయకుండా టిడిపికి మద్దతు ప్రకటించింది కానీ గత సంవత్సరం జరిగిన 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ దూకుడు చూసి ఎంతో మంది పవన్ కళ్యాణ్ ఎక్కువ స్థానాలు సంపాదించి కనీసం ప్రతిపక్ష హోదా అయినా  సంపాదిస్తారు అని అందరూ అనుకున్నారు. 

 

 

 కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం అందరికి షాక్ ఇస్తూ పోటీ చేసిన రెండు చోట్ల ఘోర ఓటమి పాలయ్యారు. ఇక జనసేన అభ్యర్థులు అందరూ ఓటమి పాలవగా..  ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే జనసేన పార్టీ గెలుచుకో కలిగింది. అయితే జనసేన పార్టీ ఇంత ఘోర ఓటమి పాలవడం పై అటు ఎంతో మంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పాలయ్యారు. దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ అభిమానులే పవన్ కళ్యాణ్ కు  ఓట్లు వేయలేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. 

 

 

 అయితే ఈ విషయాన్ని ఒకానొక సమయంలో పవన్ కళ్యాణ్ కూడా చెప్పుకొచ్చారు. తాను ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం... నీతి నిజాయితీ గా పోటీ చేయడమే అంటూ పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రతి గల్లీలో ఐదు మంది జనసైనికులు ఉంటే... 500 మంది తన అభిమానులు ఉన్నారని... కానీ తన అభిమానులే తనకు ఓటు వేయలేదు అంటూ చెప్పుకొచ్చారు. తన అభిమానులందరికీ ఎన్నికల్లో తనకు ఓటు వేయాలని ఉన్నప్పటికీ... కులం వర్గం పేరుతో కొంతమంది వారిని ఓటు వేయకుండా ప్రభావితం చేశారు అంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: