గొప్ప నటుడు నందమూరి తారక రామారావు వందల సినిమాలు తీసిన తర్వాత రాజకీయ రంగంలోకి అడుగు పెట్టి ప్రజలకు సేవ చేయాలనుకున్నారు. తన ఆలోచనని ఆచరణలో పెట్టి రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసి కేవలం 9 నెలలలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అవతారమెత్తిన ఎన్టీఆర్ కాంగ్రెస్ పతనానికి నాంది పలికారు. ఐతే అప్పట్లో మరొక స్టార్ హీరో కాంగ్రెస్ పార్టీలో చేరి... ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయినందుకు చాలా అసూయ పడ్డారు. అందుకే ప్రత్యేకంగా ఎన్టీఆర్ ని కించపరిచేలా సినిమాలు తీసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారమే రేపారు.



ఒక సినిమాలో ఒక ప్రముఖ హాస్య నటుడు, ప్రతినాయకుడైన ఒక వ్యక్తి ఎన్టీఆర్ రోల్ చేస్తే... అతనిని విజయవాడ రైల్వే స్టేషన్లో పట్టుకొని ఎన్టీఆర్ మద్దతుదారులు చెప్పులతో కొట్టారు. ఎన్టీఆర్ ని కించపరిచేలా ఉన్న క్యారెక్టర్ లో నటించి తీవ్ర అవస్థలు పడి ఛాన్సులు రాక చివరికి ఎన్టీఆర్ కాళ్ళ మీద పడ్డాడట ఆ నటుడు. కేవలం ఓ స్టార్ హీరో అడిగాడని ముందు వెనుక ఆలోచించకుండా ఏ రోల్ పడితే ఆ రోల్ చేసి ఎన్నో అవస్థలు పడ్డానని ఇప్పటికి పశ్చాత్తాపడతాడు ఆ నటుడు. వాస్తవానికి వీటన్నిటికీ కారణం ఆ బడా స్టార్ హీరో అని చెప్పుకోవచ్చు కానీ అతను ఏ సమస్యలని ఎదుర్కోకుండా తప్పించుకున్నాడు.




ఇకపోతే ఎన్టీఆర్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ రెండు మూడు చిత్రాలు తీసిన ఆ స్టార్ హీరో ఎన్టీఆర్ సినిమాలు తీసే రోజుల్లో కూడా అతన్ని వృత్తిపరంగా టార్గెట్ చేసేవారు. అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారకరామారావు సినిమాలతో పోటాపోటీగా తాను చాలా సినిమాలను తీసే వెంటవెంటనే విడుదల చేసేవారు. ఒక సినిమా గురించి ఎన్టీఆర్ మధ్య, ఇంకా ఆ బడా హీరో మధ్య తీవ్రమైన మనస్పర్థలు ఏర్పడ్డాయని అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే సంగతి పక్కన పెడితే వీరిద్దరి మధ్య ఉన్న విరోధం అప్పట్లో ఎన్నో చర్చలకు దారి తీసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: