నటి జయలలిత 1965వ సంవత్సరంలో సినిమాల్లో తన కెరీర్ ప్రారంభం చేసింది. ఎన్నో సినిమాలలో నటించింది ఈమె. కథానాయకుని కథ, మనుషులు మమతలు, ఆమె ఎవరు?, ఆస్తిపరులు, కన్నెపిల్ల గూఢచారి నవరాత్రి, గోపాలుడు భూపాలుడు,చిక్కడు దొరకడు, ధనమే ప్రపంచలీల, నువ్వే , బ్రహ్మచారి, సుఖదుఃఖాలు, అదృష్టవంతులు, కోయంబత్తూరు ఖైదీ ఇలా అనేక సినిమాల్లో జయలలిత నటించింది. ఇలా ఆమె తన సినీ కెరీర్లో సక్సెస్ని అందుకుంది అనే చెప్పాలి.

 

 

జయలలిత తమిళనాడుకి రెండో మహిళా ముఖ్యమంత్రి. ఆమె సినిమాల నుండి రాజకీయాల్లోకి ప్రవేశించింది. ఆమె నటిగా ఎం.జి.ఆర్ సరసన ఎన్నో చిత్రాలలో నటించింది. తర్వాత ఎం.జీ.ఆర్ రాజకీయాలలో ప్రవేశించాడు. తన వెనుక  జయలలిత కూడా రాజకీయాల్లోకి వచ్చింది. 1984 నుంచి 1989 వరకు తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది. మొదటనే గెలుపు తన ఖాతాలో వేసుకుంది.

 

 

ఎంజీఆర్ మరణం తరువాత అతని వారసురాలిగా ప్రకటించుకుంది జయ లలిత. జానకి రామచంద్రన్ తమిళ్ నాడుకి మొదటి మహిళా ముఖ్యమంత్రి. జయలలిత రెండో మహిళా ముఖ్యమంత్రి.  ఆమె ప్రజల కోసం ఎన్నో చేసింది. పదవిలో ఉండగానే జైలుకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ జైలు నుండి బయటకి వచ్చాక మళ్ళీ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టింది.

 

 

ఆమె నాయకత్వములో అణ్ణా డి.ఎం.కె చిరస్మరణీయ విజయములను ఎన్నో సాధించింది. జయలాలిత వల్ల ఎంతో మందికి సాయం అందింది. పార్టికి కూడా ఎంతో మంచి పేరు వచ్చింది. 2016 వ  సంవత్సరములో జరిగిన రాజ్యసభ ఎన్నికలలో నలుగురు సభ్యులను గెలిపించుకున్నారు. అందువల్ల దేశ పార్లమెంటులో అణ్ణా డి.ఎం.కే బలము 50 కి చేరింది.  ఇది తమిళనాడులో ఎక్కడా ఏ రాజకీయ పక్షము సాధించని విజయము. ఇలా జయలలిత విజయాలు ఎన్నో ఉన్నాయి. ఈమె ఎన్నో సాధించింది. ఆ పార్టీ కూడా మంచి స్థానం దక్కించుకుంది జయ లలిత పరిపాలనతో.

మరింత సమాచారం తెలుసుకోండి: