చిత్ర పరిశ్రమకు రాజకీయాలకు ఎంతో అవినాభావ సంబంధం ఉంటుంది అన్న విషయం తెలిసిందే ఎందుకంటే చాలామంది నటీనటులు రాజకీయాల్లోకి వెలుతు  ఉంటారు. ఇంకొంత మంది రాజకీయ నాయకులు అటు రాజకీయాల్లోనూ సక్సెస్ ఫుల్ గా  రాణిస్తూనే సినిమాలలో కూడా నటిస్తూ ఉంటారు. ఇది ఇప్పటి నుంచి కొనసాగుతోంది కాదు. ఎన్నో ఏళ్ల నుంచి ఇలా సినిమా వాళ్ళు రాజకీయాల్లో కి వెళ్లడం.. రాజకీయాల్లో ఉన్నవారు సినిమాల్లో నటిస్తుండడం జరుగుతూనే వస్తోంది. ఇప్పటివరకు చాలా మంది సినిమా నటులు రాజకీయాల్లోకి వెళ్ళి తమ సత్తా చాటుతున్నారు. ఏకంగా చిత్ర పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి వెళ్ళి చరిత్ర సృష్టించిన వారు కూడా ఉన్నారు. 

 

 

 ఇప్పటి కాలంలో మాత్రం చాలా మంది సినీ నటులు రాజకీయాల్లోకి వెళుతున్నవారు కానీ తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోలేక పోతున్నారు. రాజకీయాల్లో బోల్తా పడుతూ మళ్లీ సినిమాలకే పరిమితమవుతున్నారు. ఇదిలా ఉంటే సినిమాలో ఎంతో క్రేజ్ సంపాదించి ఎన్నో ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో కొనసాగుతూ... హీరోగా,  క్యారెక్టర్ ఆర్టిస్టుగా,  కమేడియన్గా ఇలా ఎన్నో విభిన్నమైన పాత్రలు చేసుకుంటూ ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్న నటుడు అలీ, ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో అలికి  మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం ఏ సినిమాలో చూసినా కమెడియన్ గా  అలీ కనిపిస్తూ ఉంటాడు. ఇక తనదైన డైలాగ్ డెలివరీతో ఎంతో మంది ప్రేక్షకులను సంపాదించుకున్నాడు. 

 

 

 అయితే 2019 ఎన్నికలకు ముందు కమెడియన్ అలీ వైసీపీ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ విషయం ఆంధ్ర రాజకీయాల్లో సంచలనం గా మారిపోయింది. అలీ పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడు అని అందరికీ తెలిసిందే. అలాంటి అలీ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరకుండా..  వైసీపీ పార్టీలో చేరడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే అలీ వైసీపీ అధికారంలోకి వస్తుంది అని భావించే వైసీపీలో చేరిన అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అంతేకాదు వైసీపీ లో చేరడానికి వెనుక ఒక బలమైన కారణం కూడా ఉంది అంటూ వార్తలు హల్చల్ చేస్తాయి. హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో అలీకి కొన్ని భూ  సమస్యలు ఉన్నాయని... ఇలాంటి సమయంలో కేసిఆర్ జగన్ సన్నిహితంగా ఉన్న కారణంగా వైసీపీ లో చేరితే... జగన్ సాయం చేయడం వల్ల కేసీఆర్ హైదరాబాద్ లో  ఉన్న అలీ భూ సమస్యలను పరిష్కరిస్తారని కారణంతోనే అలీ వైసీపీలో చేరారని గతంలో ప్రచారం కూడా జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: