ప్రస్తుత ఏపీ మంత్రి కొడాలి నాని అలియాస్ వెంకటేశ్వర్లు కృష్ణా జిల్లా రాజకీయాల్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈయన మొదట సినీరంగం లోనుంచి రాజకీయాలలోకి వచ్చారు. తర్వాత అసలు రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి.. జీవితంలో ఆయనకు ఆయనే సాటి, ఆయన ఒక సంచలనం సృష్టించాడు. మాస్ ఫాలోయింగ్ ను పెంచుకున్నా. గుడివాడ రాజకీయంలో ఆయనకు తిరుగులేదన్నట్లు వరుసగా నాలుగు సార్లు విజయం సాధించి తిరుగులేని నేతగా పేరు సంపాదించుకున్నారు. 20 సంవత్సరాలుగా గుడివాడ రాజకీయాల్లో మకుటం లేని మహారాజుగా ఏదిగారు.

 

 

కొడాలి నాని రాజకీయ జీవితం టీడీపీ నుంచే ప్రారంభమైందని చెప్పాలి. దివంగత సీఎం ఎన్టీఆర్ కు నాని పిచ్చి అభిమాని. అంతేకాదు ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణను తన రాజకీయ గురువుగా చెప్తుంటారు కొడాలి నాని. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా ఇప్పటికీ తాను ఎన్టీఆర్ వీరాభిమానిని అని చెప్తారు. 2004లో గుడివాడ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు కొడాలి నాని. 

 

 

మరల 2009లో కూడా టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు ఈయన. తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడిగానే ఉంటూ గుడివాడ సమస్యల కోసం పార్టీలోనే గళమెత్తాడు కొడాలి నాని. గుడివాడ స‌మ‌స్య‌ల కోసం హైద‌రాబాద్‌ కు పాద‌యాత్ర చేశారు ఈయన. అలా పాదయాత్ర చేసిన  ఏకైక వ్యక్తి నానినే.. 2009లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని ఆ తర్వాత వైయస్  జగన్ వెంట నడిచారు. వైయస్ జగన్ స్థాపించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయనపై అనర్హత వేటు సైతం పడింది. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో సైతం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు.

 

 

 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్  జగన్మోహన్ రెడ్డికి వీరాభిమాని కొడాలి నాని. వైయస్ జగన్ అడిగితే ప్రాణమిస్తానంటూ కొన్నిసార్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కోసం ఎక్కడికైనా వెళ్తా.. ఎందాకైనా వెళ్తానంటూ వార్తల్లో నిలిచారు కొడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: